Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనకనంద ఆస్పత్రిలో అనధికారికంగా కిడ్నీ మార్పిడి!!

Advertiesment
Kidney

ఠాగూర్

, బుధవారం, 22 జనవరి 2025 (10:22 IST)
హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ డివిజన్‌లో ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అనధికారికంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం తాజాగా వెలుగులోకి రావడంతో కలకలం చెలరేగింది. అనుమతి లేకుండా ఆసుపత్రి నిర్వహణతో పాటు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయన్న సమాచారంతో అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, డీఎం అండ్ హెచ్ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.
 
ఇతర రాష్ట్రాలకు చెందిన అమాయకులకు డబ్బులు ఆశ చూపి, ఇతర ప్రాంతాల నుంచి డాక్టర్లను తీసుకొచ్చి కిడ్నీ మార్పిడి చికిత్సల ద్వారా డబ్బులు దండుకుంటున్నారని అధికారుల విచారణలో తేలింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు, కర్ణాటకకు చెందిన ఇద్దరికి కిడ్నీ మార్పిడి చికిత్సలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు కిడ్నీలు ఇవ్వగా, వాటిని కర్ణాటకకు చెందిన ఇద్దరు రోగులకు అమర్చినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.
 
ఈ క్రమంలో కిడ్నీ దాతలతో పాటు ఇద్దరు రోగులను నాలుగు అంబులెన్స్లలో పోలీసులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలకనంద ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ఆసుపత్రి ఎండీ సుమంత్ చారి, సిబ్బందిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం స్టాలిన్ హయాంలో అత్యాచారాలు పెరిగిపోయాయి : నటి గౌతమి