అద్దె గర్భం విధానం ఈనాటిది కాదంటున్న టర్కీ ప్రొఫెసర్

అద్దె గర్భం లేదా సరోగసి. ఈ విధానం ద్వారా పిల్లలు లేని తల్లులు మరో స్త్రీ ద్వారా (అద్దెగర్భం) ద్వారా పిల్లల్ని కనడం. అయితే, ఈ విధానం జరిగే కాన్పుల సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి.

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (09:49 IST)
అద్దె గర్భం లేదా సరోగసి. ఈ విధానం ద్వారా పిల్లలు లేని తల్లులు మరో స్త్రీ ద్వారా (అద్దెగర్భం) ద్వారా పిల్లల్ని కనడం. అయితే, ఈ విధానం జరిగే కాన్పుల సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి. ముఖ్యంగా.. కోటీశ్వరులు, సెలబ్రెటి మహిళల్లో పెక్కుమంది ఈ విధానం ద్వారా తల్లులు అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
అయితే ఈ విధానం ఈ కాలం నాటిదని టర్కీకి చెందిన పురావస్తు శాఖ ప్రొఫెసర్ ఒకరు అంటున్నారు. సరోగేట్‌ విధానం 4 వేల ఏళ్ల క్రితమే ఉందని ఆయన చెపుతున్నారు. టర్కీలో దొరికిన ఆ కాలపు నాటి ఓ వివాహ ఒప్పంద పత్రంలో ఈ విషయాన్ని గుర్తించారు. వివాహమైన జంటకు రెండేళ్ల వరకూ సంతానం కలగకపోతే.. సదరు భర్త పిల్లల కోసం ఓ బానిస స్త్రీని వినియోగించవచ్చు. వారికి తొలి మగ బిడ్డ పుట్టాక ఆ కుటుంబం బానిస స్త్రీకి విముక్తి కల్పించాలి. 
 
ఓ మట్టి పాత్ర మీద చెక్కిన వివాహ ఒప్పంద పత్రంలో ఈ వివరాలను గుర్తించినట్లు టర్కీలోని హర్రన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్ బెర్కిజ్‌ టర్ప్‌ వెల్లడించారు. ఈ ప్రాంతం మెసపొటేమియన్‌ నాగరికతలో భాగమైన అస్సిమిరియన్‌ సామ్రాజ్యంలో ఉండేదని, ఏ ఒక్కరూ సంతానం లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో నాడు ఈ నిబంధన విధించి ఉండవచ్చని టర్ప్‌ వ్యాఖ్యానించారు. ఈ ఆధారాన్ని ఇస్తాంబుల్‌ పురావస్తు ప్రదర్శనశాలలో భద్రపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments