Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

5 సెకన్లలో మగాడి 'సత్తా'ను తేల్చే స్మార్ట్ ఫోన్.. ఇక షేక్ కావాల్సిందే...

మగాళ్ల ప్రపంచం ఈ దెబ్బతో వణికిపోవాల్సిందే.. సంతానం కలుగకపోతే అయినదానికీ, కానిదానికీ ఆడవాళ్లను ఆడిపోసుకునే మగ ప్రపంచం గుట్టు బయట పెట్టే టెక్నాలజీ వచ్చేసింది. అమెరికా పరిశోధకులు బాంబ్ లాంటి వార్త పేల్చారు. మగాడి వీర్యం సరుకు ఎంతనే దాన్ని క్షణాల్లో కనిప

5 సెకన్లలో మగాడి 'సత్తా'ను తేల్చే స్మార్ట్ ఫోన్.. ఇక షేక్ కావాల్సిందే...
, గురువారం, 23 మార్చి 2017 (19:18 IST)
మగాళ్ల ప్రపంచం ఈ దెబ్బతో వణికిపోవాల్సిందే.. సంతానం కలుగకపోతే అయినదానికీ, కానిదానికీ ఆడవాళ్లను ఆడిపోసుకునే మగ ప్రపంచం గుట్టు బయట పెట్టే టెక్నాలజీ వచ్చేసింది. అమెరికా పరిశోధకులు బాంబ్ లాంటి వార్త పేల్చారు. మగాడి వీర్యం సరుకు ఎంతనే దాన్ని క్షణాల్లో కనిపెట్టేసే కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. పైగా ఇంటివద్దే తన వీర్యం నాణ్యత ఎంతో తెలుసుకునే అవకాశం ఈ స్మార్ట్ ఫోన్ ఇస్తుందట. ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల 50 లక్షల మంది దంపతులను వ్యంధత్వం (బిడ్డలు పుట్టకపోవడం) పీడిస్తున్న విషయం తెలిసిందే. పైగా సంతాన రాహిత్యానికి సంబంధించిన సమస్యల్లో 40 శాతం పైగా కేవలం వీర్యం నాణ్యత లోపించిన దాని కారణంగానే సంభవిస్తున్నాయని సైన్స్ ట్రాన్స్‌లేషన్ మెడిసన్ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో వీర్యం నాణ్యతను ఇంట్లోనే చెక్ చేసుకుని నివారణ చర్యలు చేపట్టే అవకాశాన్ని ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ఇస్తోందని తెలిపింది.
 
సంతానం కలుగకపోవటానికి భార్యాభర్తల్లో ఎవరిది లోపమైనా ఆ విషయం నిర్ధారించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లడం అంటే దంపతులిద్దరికీ ఇంతవరకు నరకప్రాయంగానే ఉంటూ వస్తోంది. కానీ ఆసుపత్రుల్లో కూడా ఇప్పుడు ప్రత్యేక గదుల్లో వీర్యం నమూనాలను సేకరించి అత్యంత సులభంగా వాటి నాణ్యతను నిర్ధారించవచ్చని బ్రిగ్‌హామ్ అండ్ ఉమెన్ హాస్పిటల్ డాక్టర్ పాది షఫీ తెలిపారు. ఈ ప్రత్యేక గదుల్లో పరీక్ష చేయించుకోవడం వల్ల మగాళ్లలో ఒత్తిడి, చిరాకు, నిరాశ, అసంతృప్తి వంటివి లేకుండా పోతాయని ఆమె అన్నారు. పైగా  ఈ వీర్య పరీక్ష అతి తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చని తెలిపారు. ఈ సరికొత్త పరీక్ష కేవలం అయిదు సెకన్లలో వీర్యం శాంపుల్‌ను విశ్లేషించి ఫలితాలను తెలుపుతుందిని చెప్పారు.
 
ఇప్పటికే మసాచెసెట్స్ జనరల్ హాస్పిటల్ ఫెర్టిలిటీ సెంటర్‌లో ఇప్పటికే 350 వీర్యం నమూనాలను ఈ కొత్త టెక్నాలజీ ఆధారంగా పరీక్షించారట. స్మార్ట్ ఫోన్‌కు వీర్యం నమూనాను లోడ్ చేసే డిస్పోజబుల్ డివైస్‌కు కనెక్ట్ అయి ఉండే ఆప్టికల్ అటాచ్‌మెంట్‌ సమ్మేళనంతో ఇది పని చేస్తుంది. అసాధారణ రీతిలో స్పందించే వీర్యం నమూనాలను ఈ స్మార్ట్ ఫోన్ ఆధారిత డివైస్ ఇట్టే పసిగడుతుంది. ఇది ఇప్పటికే 98 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తున్నట్లు తేలింది.
 
అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో వినియోగదారుకు లేదా ఆసుపత్రులకు వీర్య పరీక్ష చేసే అవకాశమిస్తున్న ఈ కొత్త టెక్నాలజీ వైద్య రంగంలో ఒక గేమ్ చేంజర్‌ కాబోతున్నట్లు ఎంసిహెచ్ ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ జాన్ పెట్రోజా చెప్పారు. సంతాన సాఫల్య సంరక్షణకు ఇది ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని, త్వరలో దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని జాన్ చెప్పారు.
 
సంతానలేమికి ఆడది కారణం అంటూ ఆడిపోసుకుంటున్న పురుషాధిక్య సమాజం ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఆధారిత టెక్నాలజీ ముందు తేలిపోనుందని సమాచారం. ఇక ఎలాంటి సాకులూ చెప్పడానికి వీల్లేదు. పిల్లలు కలగలేదంటే మగాడే కారణం అని తేలిపోయే రోజులు వస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారానికి ఒకసారి పసుపు వేసిన నీటిని తాగితే....?