Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంబిక, అంబాలికల్లా.. ఇకపై వితంతువులు కూడా సంతానం పొందవచ్చు..

మహాభారతంలో విచిత్ర వీర్యుడు మరణించడంతో వితంతువులైన అంబిక, అంబాలికలకు ధృతరాష్ట్రుడు, పాండురాజులు జన్మించినట్లు వ్యాసుని యోగ దృష్టి చేత జన్మించిన సంగతి గుర్తుంది కదూ.. ఇదే తరహాలో తాజాగా వితంతువులు సరోగస

అంబిక, అంబాలికల్లా.. ఇకపై వితంతువులు కూడా సంతానం పొందవచ్చు..
, ఆదివారం, 13 ఆగస్టు 2017 (12:44 IST)
మహాభారతంలో విచిత్ర వీర్యుడు మరణించడంతో వితంతువులైన అంబిక, అంబాలికలకు ధృతరాష్ట్రుడు, పాండురాజులు జన్మించినట్లు వ్యాసుని యోగ దృష్టి చేత జన్మించిన సంగతి గుర్తుంది కదూ.. ఇదే తరహాలో తాజాగా వితంతువులు సరోగసీ పద్ధతి ద్వారా సంతానాన్నిచ్చే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇందులో భాగంగా వితంతువులకు సహజీవనం చేసే దంపతులకు కూడా అద్దె గర్భం ద్వారా పిల్లల్ని పొందే అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ ప్యానల్‌ సూచించింది.
 
అలాగే ఎన్నారైలకు, భారత సంతతికి చెందిన విదేశీయులకు కూడా భారత్‌లో సరోగసీ ద్వారా పిల్లల్ని పొందడానికి అవకాశం కల్పించాలని సూచించింది. 2016 సరోగసీ బిల్లు ప్రకారం విదేశీయులకు భారత్‌లో సరోగసీ ద్వారా పిల్లల్ని పొందడానికి అవకాశం లేదు. కానీ ప్రస్తుతం దాన్ని సవరించాలని కేంద్రానికి ప్యానల్ సిఫార్సు చేసింది. 
 
ఇకపోతే.. ఇప్పటివరకు చట్టప్రకారం దంపతులైన వారికి మాత్రమే సరోగసీని ఉపయోగించుకునే వీలుండేది. ఇకపై వితంతువులకు, సహజీవనం చేసేవారికి ఈ కూడా ఈ సరోగసీ విధానాన్ని అమలు చేయనుంది. కానీ స్వచ్ఛంద సరోగసీ పేరుతో కొన్ని సందర్భాల్లో పిల్లల్ని కనే తల్లులకు ఎటువంటి పారితోషికమూ ఇవ్వకపోవడాన్ని ప్యానల్‌ వ్యతిరేకించింది. 
 
సరోగసీకి అంగీకరించిన తల్లులకు తప్పకుండా పారితోషికం అందేలా చూడాలని ప్రభుత్వానికి ప్యానల్ విజ్ఞప్తి చేసింది. సరోగసీ ద్వారా పిల్లల్ని కనే తల్లులు ప్రసవ సమయంలోనూ, తర్వాత ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని గుర్తు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేయి లేకపోతే ఏం... చల్తా హై... జాలీగా వుండు గురూ అంటున్న యువతి