Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండబెట్టిన రెండు ఉసిరి ముక్కలు తీసుకుంటే?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:30 IST)
ఎండబెట్టిన ఉసిరిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఉసిరిని ఎండబెట్టిన ముక్కలుగా లేదా ఉసిరి పొడిగా కూడా తీసుకోవచ్చు. ఉసిరిని భోజనం తర్వాత రెండు ముక్కలు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉసిరికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఎండబెట్టిన ఉసిరిని రోజూ తీసుకోవడం వలన మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. అంతేకాదు కంటి చూపును మెరుగుపరుస్తుంది. 
 
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మురబ్బా, ఊరగాయలు లేదా క్యాండీలుగా తినండి. ఏ రూపంలోనైనా ఉసిరిని రోజూ రోజూ రెండు ముక్కలు తినడం ద్వారా ఆరోగ్యంగా వుండవచ్చు.
 
ఉసిరిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. సీజనల్ వ్యాధులైన జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్న సమయంలో రెండు టీస్పూన్ల ఉసిరి పొడిని , రెండు టీస్పూన్ల తేనెతో కలిపి.. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు తీసుకుంటే.. మంచి ఫలితం ఇస్తుంది. గొంతునొప్పి, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
ఉసిరి పొడిని నీటిలో కలిపి తీసుకోవచ్చు. లేదా ఉసిరి రసాన్ని అరకప్పు నీటిలో వేసి.. ఆ నీటితో పుక్కిలి పడితే.. నోటి పూతనుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ సంబంధిత నొప్పిని తగ్గించడంలో ఉసిరి మంచి సహాయకారి. ఎండిన ఉసిరిని రోజూ రెండు చొప్పున తినండి. ఆరోగ్య రక్షణలో అద్బుతంగా పని చేస్తుంది. తేనె , ఎండిన ఉసిరిని తీసుకోవడం వలన శరీరంలో కఫ దోషాలను తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments