Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంగారెడ్డిలో వాటర్‌ హెల్త్‌ కేంద్రం ఏర్పాటుచేసిన ఏబీ ఇన్బెవ్‌ యొక్క క్రౌన్‌ బ్రూవరీ

సంగారెడ్డిలో వాటర్‌ హెల్త్‌ కేంద్రం ఏర్పాటుచేసిన ఏబీ ఇన్బెవ్‌ యొక్క క్రౌన్‌ బ్రూవరీ
, శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (17:25 IST)
ప్రపంచంలో సుప్రసిద్ధ బ్రూవర్‌ అన్హ్యూసర్‌ బుష్‌ ఇన్బెవ్‌ (ఏబీ ఇన్బెవ్‌) తమ మొట్టమొదటి వాటర్‌ హెల్త్‌ కేంద్రం (డబ్ల్యుహెచ్‌సీ)ను సంగారెడ్డిలో జలధార ఫౌండేషన్‌ మరియు వాటర్‌హెల్త్‌ ఇండియా భాగస్వామ్యంతో  ప్రారంభించింది. ఈ వాటర్‌ హెల్త్‌ సెంటర్‌, ఏబీ ఇన్బెవ్‌ ఇండియా యొక్క క్రౌన్‌ బ్రూవరీ సమీపంలో ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాన్ని శ్రీమతి ఎం విజయలక్ష్మి, ఛైర్మన్‌- సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రారంభించారు.
 
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్‌ బీ చంద్రశేఖర్‌; సంగారెడ్డి మున్సిపాలిటీ మేనేజర్‌ అలీ బేగ్‌ పాల్గొన్నారు. నీటి నిర్వహణపై 2025 ప్రపంచ సుస్ధిరత లక్ష్యాలను చేరుకోవడానికి కంపెనీ ప్రయత్నాలను ఈ ఆవిష్కరణ బలపరుస్తుంది. అలాగే నీటి లభ్యత, భద్రతను సైతం ఇది వృద్ధి చేస్తుంది. అంతేకాదు గ్రామీణ, పట్టణ, నగరాలలోని నిరుపేదలకు సురక్షిత తాగునీటిని అందించాలనే లక్ష్యంతో జలధార ఫౌండేషన్‌, వాటర్‌ హెల్త్‌ ఇండియాతో  ఏబీ ఇన్బెవ్‌ ప్రస్తుత భాగస్వామ్యాన్ని ఇది శక్తివంతం చేయనుంది.
 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపాలిటీ ఛైర్మన్‌ శ్రీమతి ఎం విజయలక్ష్మి, ఛైర్మన్‌ మాట్లాడుతూ, ‘‘సంగారెడ్డిలో సురక్షిత తాగునీటిని అందించాలనే మా ప్రయత్నాలకు తోడ్పాటునందిస్తున్న ఏబీ ఇన్బెవ్‌, జలధార ఫౌండేషన్‌ మరియు వాటర్‌హెల్త్‌ ఇండియాలను అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన మద్దతును మేము అందిస్తాం’’ అని అన్నారు.
 
సంగారెడ్డి వాటర్‌ హెల్త్‌ సెంటర్‌ గంటకు 1000 లీటర్ల స్వచ్ఛమైన నీటిని మార్కెట్‌ ధరలో 70% తక్కువ ధరతో అందిస్తుంది. ఈ సేకరించిన నగదుతో ఈ మెషీన్ల నిర్వహణ కార్యక్రమాలను చేస్తారు. వాటర్‌ హెల్త్‌ ఇండియా 25 సంవత్సరాల పాటు దీని నిర్వహణ కార్యక్రమాలను చూసుకుంటుంది.
 
‘‘నీటి కొరత తీవ్రమవుతున్న వేళ ఈ తరహా వాటర్‌ హెల్త్‌ కేంద్రాల ఆవశ్యకత   అధికంగా ఉంది. స్వచ్ఛమైన తాగు నీటి లభ్యతకు దూరంగా ఉన్న కమ్యూనిటీలకు సురక్షితమైన మరియు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడు దాదాపు 20వేల మంది ప్రజలకు సురక్షిత తాగు నీటిని అందించగలుగుతున్నాం. జలధార ఫౌండేషన్‌, వాటర్‌హెల్త్‌ ఇండియాతో మా భాగస్వామ్యం ద్వారా  మేము కార్యకలాపాలు నిర్వహిస్తున్న కమ్యూనిటీలలో నీటి లభ్యత పరంగా ఎదురవుతున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొంటున్నాం’’ అని అశ్విన్‌ కక్‌, హెడ్-ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌  సస్టెయినబిలిటీ, ఇండియా అండ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఆసియా,ఏబీ ఇన్బెవ్‌ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింహాచ‌లంలో జగన్మోహన్ రెడ్డి పేరుతో విజ‌య‌సాయి ప్రత్యేక పూజలు