Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాయామం చేసిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (17:40 IST)
వ్యాయామం చేసే రోజుల్లో పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదయాన్నే వ్యాయామం చేసే అలవాటు ఉన్నవారు ఒక అరటి పండు తీసుకుంటే మంచిది. దాన్నుంచి కార్బొహైడ్రేడ్లు ఎక్కువగా లభిస్తాయి. దీన్ని వ్యాయామానికి అరగంట ముందు తింటే మంచిది. 
 
అదిలేనప్పుడు... టోస్ట్ చేసిన గోధుమ బ్రెడ్ తిన్నా, స్మూతీస్ తీసుకున్నా బాగానే ఉంటుంది. పెరుగు బాగా గిలకొట్టి పండ్ల ముక్కల్లో వేయాలి. పైన కాస్త తేనె చేర్చాలి. దీన్ని తింటే అరుగుదల బాగుంటుంది. వ్యాయామం సమయంలో జీర్ణాశయం శుభ్రపడుతుంది. మధ్య మధ్యలో నీళ్లూ తాగుతుండాలి. వ్యాయామం పూర్తయ్యాక కాసేపు రిలాక్స్ కావాలి. ఆ తర్వాత ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. వీలుంటే కొబ్బరినీళ్లకు ప్రాధాన్యం ఇవ్వండి.
 
జాగింగ్, రన్నింగ్ చేసేవారు ఓట్‌మీల్ తీసుకుంటే కావల్సిన శక్తి అందుతుంది. త్వరగా అలసి పోవడం జరగదు. దీన్ని జావ, ఉప్మా ఎలాగైనా తీసుకోవచ్చు. అలానే మార్కెట్లో మల్టీగ్రెయిన్ బ్రెడ్ అందుబాటులో ఉంది. దీని మీద తేనె రాసి తిన్నా మంచిదే. 
 
వ్యాయామం తర్వాత... కండరాలకు విశ్రాంతి అవసరం. అలాంటప్పుడు శరీరానికి అమినో ఆమ్లాలు అందితే కండరాలు ఉత్తేజితమవుతాయి. గుడ్డులో ఈ ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి. ఉడికించిన గుడ్ల మీద మిరియాల పొడి చల్లుకుని తింటే మంచిది. యాపిల్, బాదం, తృణ ధాన్యాలూ, పెరుగు తీసుకోవాలి. వీటిలో ఉండే పోషకాలు శారీరక ఒత్తిడిని దూరం చేస్తాయి. పిస్తా పప్పులో పోటాషియం ఉంటుంది. ఇది శరీరం దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments