Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి పండ్లను మధుమేహం వున్నవారు వెంటనే తినకూడదు...

Webdunia
గురువారం, 13 మే 2021 (23:01 IST)
మధుమేహం ఉన్నవాళ్లలో ఒంట్లో నీరు తగ్గిపోతే తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తుంది. కనుక వీరు సాధ్యమైనంత ఎక్కువుగా నీరు తాగుతూ ఉండాలి. పాలు, పెరుగు వంటి పాల పదార్ధాలను తీసుకోవచ్చు గానీ కొవ్వు ఎక్కువుగా ఉండే బటర్, చీజ్, నెయ్యిలకు దూరంగా ఉండటం మంచిది.
 
రోజుకి కనీసం మూడు సార్లయినా తాజా కూరగాయలు తీసుకోవాలి. క్యాబేజీ, పుదీనా, పాలకూర, కాకరకాయ, బెండకాయ, కాలీఫ్లవర్, దోసకాయ, క్యారెట్, ముల్లంగి, ఉల్లికాడలు, గుమ్మడికాయ మధుమేహులకు ఎంతో మేలు చేస్తాయి.
 
తాజా పండ్లు తినటమూ మంచిదే. వీటిలో సహజంగా ఉండే చక్కెర సుక్రోజ్ కన్నా నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. అయితే చాలా తీయగా ఉండే మామిడి, అరటి వంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇలాంటి పండ్లను భోజనం చేసిన వెంటనే తింటే రక్తంలో గ్లూకోజ్ త్వరగా పెరుగుతుంది. 
 
మధుమేహం ఉన్న వాళ్లు ఎట్టి పరిస్ధితులలోను ఆహారం తినటాన్ని మానేయటం మంచిదికాదు. ప్రతిరోజు ఒకే సమయంలో భోజనం చేయటం వల్ల రక్తంలో చక్కెర స్థిరంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. కేకులు, మిఠాయిలు, చాక్లెట్లు వంటి అధిక చక్కెర గల పదార్ధాలకు దూరంగా ఉండాలి. తీయటి పానీయాల జోలికి వెళ్లకపోవటం మంచిది.
 
ఎక్కువ నూనెతో వేయించే పదార్ధాలకన్నా ఉడికించినవి తినటం ఎంతో మంచిది. అలాగే అన్నం, ఆలుగడ్డ, అరటి వంటివి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచుతాయి. కాబట్టి ఇలాంటివి పెద్దమెుత్తంలో తినకుండా చూసుకోవాలి. మధుమేహులకు రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆహారంలో ఉప్పు తగ్గించుకోవటం అన్ని విధాలా మంచిది. అన్నింటికన్నా ముఖ్యంగా రోజులో ఎప్పుడైనా సరే .. ఆహారాన్ని ఒకేసారి పెద్దమెుత్తంలో తినకుండా జాగ్రత్తపడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan: కల్తీ మద్యం వ్యాపారంలో ఏపీని నెంబర్ 1గా మార్చారు.. జగన్

ఏపీలో కల్తీ మద్యం తయారీ కేసు : ఇద్దరు తెలుగుదేశం నేతలపై వేటు

భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని చిన్నమ్మను చంపేసి మృతదేహాన్ని ముక్కలు చేశాడు..

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - 8 మందిరోగుల సజీవదహనం

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'థామా' నుంచి నువ్వు నా సొంతమా పాట రిలీజ్

Geethamadhuri : కానిస్టేబుల్ లో గీతామాధురి పాడిన ధావత్ సాంగ్ కు ఆదరణ

Dil Raju: తేజసజ్జా తో దిల్ రాజు చిత్రం - ఇంటికి పిలిచి ఆత్మీయ వేడుక జరిపాడు

Anupam Kher: కాంతార ఛాప్టర్ 1 చూశాక మాటలు రావడంలేదు : అనుపమ్ ఖేర్

బిగ్ బాస్-9 సీజన్ : ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో... తెలుసా?

తర్వాతి కథనం
Show comments