Publish Date: Tue, 20 Apr 2021 (20:23 IST)
Updated Date: Tue, 20 Apr 2021 (20:25 IST)
మామిడిపండ్లు తినడానికి బరువు పెరగడంతో సంబంధం లేదని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇందులో కొలెస్ట్రాల్ లేదు, ఉప్పు కూడా లేదు. శరీరానికి ఈ వేసవిలో పోషకాలను అందించే సరైన పండు. అయినప్పటికీ, ఈ పండును అతిగా తింటే, అది ఖచ్చితంగా బరువు పెరగడానికి కారణం కావచ్చు. ఏదైనా మితంగా తీసుకుంటుంటే ఎలాంటి సమస్య వుండదు.
అంతేకాదు మామిడి పండుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. మామిడి పండును తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి. నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృడంగా ఉంటుంది.
మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబందిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది. దానిలో ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్తకణాల వృద్దికి దోహదపడుతుంది.
ఈ పండులో వుండే విటమిన్లు మరియు ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతుంది. వృద్దాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది.శృంగారంలో ఆసక్తి లేనివారికి శృంగార వాంఛను కలిగిస్తుంది. మామిడిపండులో శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచే బిటాకెరోటిన్ అనే పదార్దం సమృద్దిగా ఉంది, ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది.
సిహెచ్
Publish Date: Tue, 20 Apr 2021 (20:23 IST)
Updated Date: Tue, 20 Apr 2021 (20:25 IST)