Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ టీ తాగితే నష్టాలు కూడా... ఏంటవి?

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (17:52 IST)
ప్రస్తుత మోడ్రన్ లైఫ్‌లో బిజీ షెడ్యూళ్ళతో ప్రతి ఒక్కరూ ఎంతగానో నలిగిపోతున్నారు. చాలామంది ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధచూపుతున్నారు. ఉదయం నిద్రలేవగాని గోరువెచ్చని గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ.. కొన్ని దుష్ప్రభావాలు కూడా లేకపోలేదు. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం. 
 
గ్రీన్ టీలో ఎలాంటి క్యాలరీలుండవు. అయితే కొద్దిగా షుగర్ వేయడం వల్ల, ‘వెయిట్ లాస్ ఫ్రెండ్లీ' అనే ట్యాగ్ దానంతట అదే కోల్పోయినట్లే. ముఖ్యంగా స్వీట్ గ్రీన్ టీ త్రాగడం వల్ల బరువు తగ్గడానికి బదులుగా మరింత బరువు పెరిగే అవకాశం లేకపోలేదు. అందువల్ల సాధారణంగా బరువు తగ్గాలనుకొనేవారు గ్రీన్ టీలో షుగర్‌కు బదులుగా తేనె కలుపుకుని తాగినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. 
 
గ్రీన్ టీని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. అదే మోతాదుకు మించితే, మనస్సు మీద దుష్ప్రభావం చూపుతుంది. గ్రీన్ టీలో ఉండే అధిక యాంటీయాక్సిడెంట్స్ హార్మోనులను విడగొట్టడం వల్ల గ్రంథుల్లో మార్పులు వస్తాయి. అందువల్ల రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మించి తాగరాదు. 
 
గ్రీన్ టీలో కెఫిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. కెఫిన్ తక్కువగా తీసుకుంటే, శరీరానికి కొన్ని ప్రయోజనాలుంటాయి. కెఫిన్ ఎక్కువైతే శరీరంలో నార్మల్ బాడీ ఫంక్షన్స్ పని చేయడం కష్టమవుతుంది. గ్రీన్ టీలో టానిన్ అనే కంటెంట్ ఉదరంలో ఎక్కువ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఎక్కువ హాని కలిగించకపోయినా, ఉదర సమస్యలకు దారితీస్తుంది. 
 
రక్తంలో న్యూట్రిషియన్స్ షోషణ గ్రీన్ టీ వల్ల మరో సైడ్ ఎఫెక్ట్ ఇది. ఇందులో ఉండే టానిన్ రక్తంలో షోషింపబడే కొన్ని న్యూట్రిషియన్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇలా అనేక దుష్ప్రభావాలు ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments