Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రకు సమయం దగ్గర పడుతున్న వేళల్లో...?

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (09:59 IST)
రోజులో 24 గంటలు. తెల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించేవరకు ఉరుకులు పరుగులే. ఇది నేటి యువత జీవనమయం. ఈ క్రమంలో వేళకు సరైన భోజనం చేయరు. ఆ సమయానికి ఏదో ఒకటి లాగించేస్తుంటారు. తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. 
 
ముఖ్యంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనం ఎక్కువ మంది అనుసరించే విధానం. కానీ, కొందరు తమకు నచ్చినట్టు, తమకు వీలుపడిన సమయంలో ఏ ఆహారం అంటే ఆ ఆహారాన్ని తీసుకుంటుంటారు. మరికొందరు ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటారు. కానీ, అన్నపానీయాల విషయంలో సమయ నియమాలు ఉన్నాయి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో.. అలా ఎందుకు చేయాలో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
సాధారణంగా రోజులో ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు దేహానికి ఎక్కువ క్యాలరీలు అవసరమవుతాయి. అందుకే అల్పాహారం, లంచ్ తగినంత తీసుకోవాలి. రాత్రుళ్లు విశ్రాంతికి వెళతాం కనుక డిన్నర్ స్వల్పంగా తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ లంచ్ తక్కువగా, డిన్నర్ ఎక్కువగా తీసుకోక తప్పని పరిస్థితిలో ఉన్నవారు కనీసం డిన్నర్‌లో తీసుకునే ఆహారం చాలా తక్కువ క్యాలరీలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
నిద్రకు సమయం దగ్గర పడుతున్న వేళల్లో తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. దాంతో నిద్ర తొందరగా రాదు. ఒకవేళ పట్టినా ఆ నిద్ర అంత గాఢంగా ఉండదు. ముఖ్యంగా రాత్రి డిన్నర్ తర్వాత ఇంకే ఆహారం తీసుకోవద్దు. కొందరు తియ్యటి పదార్థాలు, ఫ్రిజ్‌లో నుంచి ఐస్‌క్రీమ్ తీసుకుని తింటుంటారు. ఇది మరీ ప్రమాదకరం. చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. ఇవి మెలటోనిన్ అనే హర్మోన్‌ను తక్కువ చేస్తాయి. ఈ హార్మోనే అలసిపోయినట్టు, విశ్రాంతి భావనలను కలిగించేది. ఈ హార్మోన్ తగ్గడం వలన మెదడుకు సంకేతాలు సరిగా ఉండవు. దాంతో నిద్ర రమ్మన్నా రాదు. 
 
ఉదయం నిద్ర లేచిన తర్వాత అరగంటకు అల్పాహారం తీసుకోవడం అనువైనదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. అనువైన సమయం ఏదీ అంటే ఉదయం 7 గంటలు. బ్రేక్ ఫాస్ట్ ఆలస్యం అయితే ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయం 10 గంటల తర్వాత తీసుకోవడం సముచితమే కాదు. ఇక మధ్యాహ్నం 12.45 నుంచి 1 గంట లంచ్‌కు అనువైనది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత, మధ్యాహ్నం లంచ్‌కు మధ్య కనీసం 4 గంటల సమయం ఉండాలి. లంచ్‌ను సాయంత్రం 4 గంటల తర్వాత తీసుకోవడం అంత మంచిదేమీ కాదు. 
 
డిన్నర్‌కు అనువైన సమయం అంటే రాత్రి 7 గంటలు. రాత్రి భోజనం తర్వాత నుంచి నిద్ర వరకు 3 గంటల వ్యవధి ఉండాలి. రాత్రి 10 తర్వాతకు డిన్నర్‌ను వాయిదా వేయవద్దు. ఆలస్యంగా డిన్నర్ చేయడం వల్ల డిన్నర్‌కు, నిద్రకు మధ్య సమయం తక్కువగా ఉంటుంది. తిన్న తర్వాత నిద్రిస్తే నిద్ర నాణ్యతపై ప్రభావం పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

తర్వాతి కథనం
Show comments