Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ మహిళలు జంక్ ఫుడ్‌ను పక్కనబెట్టకపోతే...

గర్భధారణకు ముందు.. తర్వాత బరువు తగ్గడం చాలా మేలు. అధిక బరువు ఉండటం వల్ల గర్భం ధరించే అవకాశాలు తక్కువ. గర్భం ధరించాక కూడా ఎత్తుకు తగిన బరువు ఉండాలి. గర్భధారణ సమయంలో కొన్ని వ్యాయామలు క్రమం తప్పకుండా చేయ

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (11:10 IST)
గర్భధారణకు ముందు.. తర్వాత బరువు తగ్గడం చాలా మేలు. అధిక బరువు ఉండటం వల్ల గర్భం ధరించే అవకాశాలు తక్కువ. గర్భం ధరించాక కూడా ఎత్తుకు తగిన బరువు ఉండాలి. గర్భధారణ సమయంలో కొన్ని వ్యాయామలు క్రమం తప్పకుండా చేయాలి. దాంతో మీ శరీరంలోని హార్మోనులు క్రమంగా పనిచేయడానికి సమతుల్యంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది.
 
వ్యాయామాల్లో కఠినమైన లేదా బలమైన వాటికి దూరంగా ఉండాలి. లేదంటే ఆ ఒత్తిడి యూట్రస్(గర్భాశయం) మీద ఎక్కువగా పడుతుంది. గర్భంగా ఉన్నప్పుడు డాక్టర్ల సలహా మేరకు వ్యాయామాలు ఎంచుకోవాలి. సంతానోత్పత్తికి ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్, వెన్న తీసిన పాలు, పెరుగు వంటివి మహిళలకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం. సంతానోత్పత్తికి బద్ద శత్రువు ఒత్తిడి ఒకటి. గర్భంగా ఉన్నప్పుడు, ధరించాలనుకుంటున్నట్లేతే ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకోవాలి.
 
గర్భంగా ఉన్నప్పుడు సలాడ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోండి. ఇవి జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తాయి. గర్భధారణ సమయంలో ఆకలి పెరగటానికి సహాయం చేస్తాయి. గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ పూర్తిగా మానివేయాలి. జంక్ ఆహారాలు మీకు మీ శిశువుకు మంచిది కాదు. అంతేకాకుండా, అది ఆకలిని కూడా తగ్గిస్తుంది. జంక్ ఫుడ్ తీసుకోవడం తగ్గించడం ద్వారా గర్భధారణ సమయంలో ఆకలిని పెంచవచ్చు. 
 
మీరు రొటీన్ వంటకాలతో విసుగు చెంది ఉంటే అప్పుడు మీరు కొత్త వంటకాలకు ప్రయత్నించవచ్చు. మీ ఆహారంలో రుచి మారితే కచ్చితంగా మీ ఆకలిని పెంచుతుంది. పుట్టబోయే బిడ్డలో కార్టిజోల్ డెవలప్ మెంట్‌కు తులసీ సహాయపడుతుంది. వారానికి నాలుగైదు తులసి ఆకులైనా తీసుకోవడం మంచిది. సూప్స్, సలాడ్స్‌లో రెండేసి ఆకులు చేర్చుకుని తీసుకోవాలి. 
 
తులసిలో ఉండే మాంగనీస్ పుట్టబోయే బిడ్డలో ఎముకలు, కార్టిలేజ్ ఏర్పాటుకు సహాయపడుతుంది. ఇంకా మ్యాంగనీస్ పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. తులసిలో ఉండే పొల్లెట్ కంటెంట్ ప్రెగ్నెన్సీ సమయంలో అవసరమయ్యే అదనపు రక్తాన్ని అందిస్తుంది. ఇంకా, ఇది బేబీ పుట్టుకలో లోపాలను నివారిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

తర్వాతి కథనం
Show comments