Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్భనిరోధక మాత్రలు : ఎలుకలపై ప్రయోగం సక్సెస్.. ఇక పురుషులపై...

ఇంతవరకు స్త్రీలకు మాత్రమే పరిమితమైన గర్భనిరోధక మాత్రలు ఇపుడు పురుషులకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. పురుషుల కోసం కొత్తగా కుటుంబ నియంత్రణ మాత్రల తయారీకి మార్గం సుగమమైంది.

గర్భనిరోధక మాత్రలు : ఎలుకలపై ప్రయోగం సక్సెస్.. ఇక పురుషులపై...
, ఆదివారం, 21 జనవరి 2018 (15:58 IST)
ఇంతవరకు స్త్రీలకు మాత్రమే పరిమితమైన గర్భనిరోధక మాత్రలు ఇపుడు పురుషులకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. పురుషుల కోసం కొత్తగా కుటుంబ నియంత్రణ మాత్రల తయారీకి మార్గం సుగమమైంది. ఆఫ్రికాలో కనిపించే అకోకాంతెర షింపేరి, స్రొఫాంతస్ గ్రాటన్ అనే రెండు మొక్కల్లో లభ్యమయ్యే 'వొవాబైన్' అనే విషపదార్థం ద్వారా పురుషుల కోసం కుటుంబ నియంత్రణ మాత్రలు తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
 
ఈ మొక్కల్లోని విషాన్ని అతి కొద్ది మోతాదులో ఉపయోగించడం ద్వారా ఈ మాత్రలను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు గుర్తించిన మొక్కల్లోని రసాన్ని ఆఫ్రికా అడవుల్లో వేటకెళ్లే వారు తమ బాణాలకు పూసి జంతువులను వేటాడుతుంటారు. జంతువు శరీరానికి బాణం తగిలిన మరుక్షణం అందులోని విషం పనిచేసి ప్రాణాలు తీస్తుంది. అయితే ఈ విష పదార్థాన్ని చాలా అత్యల్ప స్థాయిలో వాడటం ద్వారా పురుషుల్లోని శుక్ర కణాలను ఇది అచేతన పరుస్తుందని గుర్తించారు.
 
ఇప్పటికే ఎలుకలపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. దీంతో ఇకపై పురుషుల కోసం మాత్రల రూపంలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. విషపూరితమైన వొవాబైన్‌కు కొన్ని మాంసకృత్తులు జోడించడం ద్వారా ఎలుకల్లో చేసిన ప్రయోగం విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
ఈ విష ప్రయోగంతో ఎలుకలోని వీర్య కణాలు బలహీనపడి స్త్రీ అండాశయం వైపు పరుగులు తీయలేకపోయాయని, తద్వారా ఎలుకలు సంతానోత్పత్తికి నోచుకోలేదని గుర్తించారు. దీంతో ఇదే తరహా ప్రయోగాలను ఇక పురుషులపై చేయాలని భావిస్తున్నారు. ఇది విజయవంతమైతే పురుషులు తీసుకునేలా గర్భనిరోధక మాత్రలు అదుబాటులోకి రానున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిప్స్ తిన్నారో అంతే సంగతులు..