Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కాయ రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (22:29 IST)
ఆకాకరకాయను తరచూ తీసుకోవడం వలన దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే కేన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.
 
ఆకాకరకాయలోని విటమిన్ సి శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. దీనిలో ప్లవనాయిడ్లు సమృద్దిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్ కారకాలుగా పని చేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో లభించే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యం ఇస్తే అంత మంచిది.
 
మధుమేహంతో బాధపడేవారికి ఆకాకరకాయ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని ఇన్సులిన్ స్థాయిల్ని పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్దీకరిస్తుంది. దీనిలో ఉండే పైటో న్యూట్రియంట్లు కాలేయం, కండర కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపరిచేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. వంద గ్రాముల ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి.
 
ఆకాకరకాయ గర్బిణులకు చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫొలెట్‌లు శరీరంలోని కొత్తకణాల వృద్ధికి, గర్బస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. గర్భిణులు రెండుపూటలా భోజనంలో ఈ కూరను తీసుకోవడం వలన దాదాపు వంద గ్రముల ఫొలెట్ అందుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments