వేసవి ఎండలు తెలుగు రాష్ట్రాలను బెంబేలెత్తిస్తున్నాయి. మరోవైపు కరోనావైరస్ దూకుడుగా వుంది. ఒకవైపు కరోనా ఇంకోవైపు సూర్యుడి ప్రతాపం. కరోనా నుంచి కాపాడుకుంటూనే ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. అవేంటో చూద్దాం.
ఎక్కువగా మజ్జిగ తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.కీరదోస ముక్కల్ని రెండుపూటలా తినటం వల్ల దీనిలో ఉండే పోషకాలు డీహైడ్రేషన్‌ను దరిచేరనీయవు. మలబద్దక సమస్య కూడా తగ్గుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గటం వల్ల వడదెబ్బ తగులుతుంది. దీనిని నివారించాలంటే నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు తరచూ తాగుతూ ఉండాలి.
ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి. జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి అరస్పూన్ పొడి ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి. ఎండల్లో తిరిగి రాగానే లేదా నిద్ర పోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్‌ను రాసుకోవాలి.