కూరగాయల రంగుల్లో ఆరోగ్యం.. ఎలా?

Webdunia
సోమవారం, 10 జులై 2023 (18:09 IST)
సాధారణంగా కాయకూరలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఈ రంగుల కూరగాయల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పండ్లు, కూరగాయల్లో అనేక విలువైన పోషకాలున్నాయి. వాటిలో ఉండే ఫైటోకెమికల్స్‌ను బట్టి పండ్లు, కూరగాయలకు ఆయా రంగులు సమకూరతాయి. అయితే ఒక్కో రంగుకు కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అవేంటంటే...
 
ఆకుపచ్చ : ఈ రంగుతో కూడిన పండ్లు, కూరగాయలను తినడం వల్ల జీర్ణశక్తి, కాలేయ పనితీరు మెరుగవుతుంది. దంతాలు, ఎముకలు బలపడతాయి. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ఇందుకోసం సొర, బీర, బెండ కూరగాయలతో పాటు, జామ, అవకాడో, ద్రాక్ష మొదలైన పండ్లు తినాలి.
 
పర్పుల్, నీలం : జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె, రక్తనాళాలు, మూత్రాశయాల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందుకోసం ద్రాక్ష, చిలగడదుంప, క్యాబేజీ, బీట్రూట్ తినాలి.
 
ఎరుపు : గుండె బలపడుతుంది. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. కణ ఉత్పత్తి పెరుగుతుంది. అధిక రక్తపోటు తగ్గడంతో పాటు చర్మపు ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందుకోసం రెడ్ క్యాప్సికం, టమోటా, పండు మిరప, చెర్రీ తినాలి.
 
పసుపు, నారింజ : కీళ్లు, కణజాలాలు, మృదులాస్థి మెరుగుపడతాయి. చర్మపు కొల్లాజెన్ వృద్ధి చెందుతుంది. ఇందుకోసం ఎల్లో క్యాప్సికం, ఆరెంజ్, ఎల్లో జుకినీ, అరటి, దోసపండు తినాలి.
 
తెలుపు, గోధుమ రంగు : పెద్ద పేగులు, పొట్ట ఆరోగ్యం మెరుగవుతుంది. అల్సర్లు తగ్గుతాయి. అసిడిటీ అదుపులోకొస్తుంది. ఇందుకోసం వెల్లుల్లి, ఉల్లి, బంగాళాదుంపలు, చామ దుంపలు తినాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తల్లి కళ్ళెదుటే ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు...

Harish Rao: ఆంధ్రాలో స్విచ్ వేస్తే, తెలంగాణలో బల్బ్ వెలుగుతుంది.. హరీష్ రావు

రోడ్డుకు అడ్డంగా బైకులు పార్క్ చేశారు.. తీయమన్నందుకు డ్రైవర్ గొంతు కోశారు

నాగర్ కర్నూల్ : పూజారి ఇంట్లో దొంగలు పడ్డారు.. 40 తులాల బంగారుతో జంప్

హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్య... కత్తులతో నరికివేశారు....

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba Patel: మూఢనమ్మకాలను, దొంగ బాబాలను టార్గెట్ తో ఈషా ట్రైలర్‌

హీరో సుశాంత్‌తో మీనాక్షి చౌదరి రిలేషన్?

Suman: సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు : సుమన్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

తర్వాతి కథనం
Show comments