పుదీనా వివిధ ఔషధ ఉపయోగాలతో కూడిన ముఖ్యమైన మూలికలలో ఒకటి. సువాసన గల పుదీనాతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పుదీనా రైస్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాము.
కావలసినవి: ఒక కప్పు అన్నం, పుదీనా ఆకుకూర, అల్లం, పచ్చిమిర్చి, వేయించిన వేరుశెనగ, పెద్ద ఉల్లిపాయ, మసాలాలు, కావలసినంత ఉప్పు. ముందుగా వేయించిన వేరుశనగ పప్పు, శనగపిండి, ఎండుమిర్చి, మెంతిపొడి పక్కన పెట్టుకోవాలి.
ఉడికిన అన్నాన్ని బాగా వడకట్టి వెడల్పాటి పాత్రలో వేసి చల్లారనివ్వాలి. తర్వాత పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేయాలి.
ఇప్పుడు పేస్టులా చేసుకున్న పుదీనాతో పాటు వేరుశనగ పప్పు, ఎండుమిర్చి, మెంతి పొడి మిశ్రమాన్ని జోడించండి. పూర్తిగా సిద్ధం చేసుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని చల్లారిన అన్నంలో పోసి కలపాలి. ఇక ఇప్పుడు తరిగిన కొత్తిమీర తరుగు చల్లితే టేస్టీగా వుండే పుదీనా రైస్ సిద్ధం.