Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ పొటాటో జ్యూస్ తాగితే.. ఏమవుతుంది..?

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:17 IST)
ప్రకృతి మనకు అందించిన కూరగాయల్లో బంగాళాదుంపలు ఒకటి. వీటితో అనేక రకాల వంటకాలు చేసుకుని ఆరగిస్తుంటాం. ముఖ్యంగా, ఆలూ ఫ్రై, టమోటా వంటి కూరలను, వివిధ రకాల చిప్స్‌ను తయారు చేసుకుని తింటుంటాం. అయితే కేవలం వంటలతోనే కాకుండా, ఆలూ జ్యూస్‌తో కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
బంగాళాదుంపల జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. ఆలుగడ్డల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలను బలంగా చేస్తుంది. హైబీపీని తగ్గిస్తుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఆలుగడ్డ జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉండటం వల్ల ఈ జ్యూస్‌ను తాగితే కీళ్ల నొప్పులు పోతాయి.
 
మైగ్రేన్‌ నొప్పిని దూరం చేసుకోవాలంటే బంగాళాదుంపల జ్యూస్‌ని తాగాలి. నిజానికి ఆలుగడ్డలను తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ ఈ జ్యూస్‌ తాగితే బరువు తగ్గుతారని అధ్యయనాలలో తేలింది. పొటాటో జ్యూస్ తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ. అలాగే, జీర్ణాశయం, పేగుల్లో ఏర్పడే అల్సర్లను నివారిస్తుంది. ఈ జ్యూస్‌లో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్య నుంచి ఉపశమనాన్నిస్తుంది. 
 
ఆలుగడ్డలు శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేస్తుంది. రక్తహీనత సమస్య పోతుంది. కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు పోతాయి. ఇందులో శరీరానికి రోజువారీగా కావల్సిన బి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టుకు మంచి పోషణ అందుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశంలోని సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌కు ఎన్నో స్థానం?

అక్రమ వలసల అడ్డుకట్టకు కొత్త నిబంధన అమలు : అమెరికా

Sunitha, పులివెందులకు వెళ్లేందుకు భద్రత కావాలి: వైఎస్ సునీత

'బి-నేలమాళిగ’ తెరిచే అంశంపై చర్చ.. తుది నిర్ణయం పూజారులదే..

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వసలు తెలుగేనా? నీ యాక్సెంట్ తేడాగా వుంది: మంచు లక్ష్మికి అల్లు అర్హ షాక్ (video)

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

తర్వాతి కథనం
Show comments