Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యారెట్ రసం ముఖానికి రాసుకుంటే ఏమవుతుంది?

Advertiesment
క్యారెట్ రసం ముఖానికి రాసుకుంటే ఏమవుతుంది?
, సోమవారం, 1 ఏప్రియల్ 2019 (21:49 IST)
నిత్యం మన వంట గదిలో కనిపించే క్యారెట్ ఆరోగ్యానికే కాదు అందానికి ఉపకరిస్తుంది. శక్తిని ఇచ్చే క్యారెట్ సౌందర్య సాధనగా కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. క్యారెట్లో బీటా కెరోటిన్లూ, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తితో పాటు చర్మానికి మెరుపును కూడా ఇస్తాయి. క్యారెట్ మన అందానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.
 
1. నాలుగు స్పూన్ల క్యారెట్ జ్యూస్ రెండు స్పూన్ల బొప్పాయి జ్యూస్, అందులో కొద్దిగా పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట సేపటి తర్వాత నీళ్లతో కడిగేస్తే చాలు మెరిసే ముఖ సౌందర్యం మీ సొంతం. 
 
2. క్యారెట్ యాంటీ ఏజింగ్ కారకంగా కూడా పనిచేస్తుంది. రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో, కొంచెం అరటి పండు గుజ్జు, గుడ్డులోని తెల్లసొన, నాలుగు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్ వల్ల ముఖం మీద ముడతలు మాయమవుతాయి. 
 
3. అలాగే ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో, కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే ముఖం తాజాగా మారుతుంది. అదేవిధంగా ముఖంపై మొటిమలు ఉన్న వారు రెండు స్పూన్ల క్యారెట్ రసంలో ఒక స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల మొటిమలు మాయమవడమే కాకుండా ముఖ తేజస్సు మెరుగుపడుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్కెట్‌లో కొన్న ఆకుకూరలను అదే రోజు వాడుతున్నారా?