Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి రోజూ ఓ గ్లాసు మజ్జిగ తాగితే...

Buttermilk
Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (17:03 IST)
సాధారణంగా చాలా మందికి నిద్రలేవగానే కాఫీలు, టీలు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు మజ్జిగ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా వేసవి సీజన్‌లో వేడిని తట్టుకోవడానికి మజ్జిగ ఎక్కువ తాగుతారు. మజ్జిగను పెరుగు, కొన్ని మసాల పోపు దినుసులతో రుచికరంగా తయారుచేసుకుంటారు. కరీవేపాకు, ఆవాలు, అల్లం, జీలకర్ర వంటి పోపులతో బట్టర్ మిల్క్ తయారుచేసి తీసుకుంటారు. 
 
పెరుగులో ప్రోబయోటిక్ వంటి మంచి ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. మజ్జిగ జీర్ణక్రియను పెంచుతుంది, క్యాలరీలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్దకంతో బాదపడే వారు ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు మజ్జిగను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. రోజూ ఉదయం పరగడపున మజ్జిగ తాగడం వల్ల పొందే మరికొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
 
* రోజూ ఉదయం మజ్జిగ తాగడం వల్ల పొట్ట చల్లగా ఉంచి, కడుపులో మంట తగ్గిస్తుంది. అలాగే అసిడిక్ రిఫ్లెక్షన్ వల్ల పొట్టలో చీకాకును తొలగిస్తుంది.
 
* మజ్జిగ తాగినప్పుడు, కడుపులో ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. అందుకు కారణం పొట్ట అసౌకర్యానికి గురిచేసే వ్యర్థాలను బయటకు నెట్టవేయడం వల్ల పొట్ట చల్లగా ఉంటుంది. 
 
* ఇంకా, మజ్జిగా కరివేపాకు, జీలకర్ర, పెప్పర్ పౌడర్ వంటి పదార్థాలను చేర్చడం వల్ల అనేక ఔషధ గుణాలను పొందవచ్చు.
 
* కొద్దిగా హెవీగా భోజనం చేసినప్పుడు పొట్టలో అసౌకర్యంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు అల్లం పౌడర్ కలిపిన మజ్జిగ తాగినట్టయితే జీర్ణశక్తినిన పెంచి వెంటనే కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. అసౌకర్యాన్ని పోగొడుతుంది.
 
* డీహైడ్రేషన్‌తో బాధపడే వారికి ఇది ఒక మంచి రెమెడీ. ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని మసాలా దినుసులు, ఉప్పు కలిపి తీసుకోవాలి. వేడి వాతావరణంలో మీరు సౌకర్యంగా ఫీల్ అవుతారు.
 
* మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి.
 
* డయోరియాతో బాధపడేవారు మజ్జిగలో అరటీస్పూన్ డ్రైజింజర్ పౌడర్ కలిపి తీసుకోవాలి. రోజులో మూడు సార్లు తీసుకుంటే డయోరియా సమస్య నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
 
* ఒక గ్లాసు మజ్జిగను తీసుకవోడం వల్ల కొలెస్ట్రాల్ వెల్స్ కంట్రోల్ అవుతాయి. మజ్జిగలో ఉండే బయో యాక్టివ్ ప్రోటీన్ యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. మజ్జిగను తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

పహల్గాం దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నా సంపూర్ణ మద్దతు : రాహుల్ గాంధీ

పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

తర్వాతి కథనం
Show comments