మనలో చాలా మందికి సాధారణంగా ప్రతిరోజూ ఉదయం నిద్ర లేస్తూనే బెడ్ కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి టీ లేదా కాఫీ తాగందే పొద్దు గడవదు. నిజానికి ఉదయాన్నే కాఫీ, టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకు ప్రత్యామ్నాయంగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్‌ల నెయ్యి తాగితే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి.
వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే నెయ్యి తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తారు. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే నెయ్యిలో ఉండే కొవ్వు పదార్థాలు మనకు మేలు చేస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి. ఉదయం పరగడుపున నెయ్యి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది.
గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. నెయ్యి తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆకలి మందగించిన వారు ఉదయాన్నే పరగడుపున నెయ్యి తాగడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. అల్సర్‌తో బాధపడుతున్న వారు ఉదయాన్నే నెయ్యి తాగడం మంచిది.