Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటేనే మీ 'గుండె' పదిలం... లేదంటే?

పెళ్లి చేసుకుంటేనే మీ గుండె పదిలంగా ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకొనే తీరాలంటున్నారు. ఇంతకీ విషయమేంటే, పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామితో

Webdunia
గురువారం, 12 జులై 2018 (11:41 IST)
పెళ్లి చేసుకుంటేనే మీ గుండె పదిలంగా ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకొనే తీరాలంటున్నారు. ఇంతకీ విషయమేంటే, పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామితో కలిసి ఉన్నవారు ప్రమాదకరమైన హృద్రోగాలబారిన పడే అవకాశం తక్కువగా ఉందని తాజాగా అధ్యయనంలో తేలింది. ఇందులోని ముఖ్యాంశాలను ఓసారి పరిశీలిద్దాం.
 
* పెళ్లయినవారు.. పెళ్లికానివారి జీవనశైలి, అనారోగ్య సమస్యలపై ఈ పరిశోధన 20 యేళ్ళపాటు జరిగింది. 
* పెళ్లైన వారితో పోలిస్తే పెళ్లికాని వారు గుండెపోటుతో మరణించే అవకాశం 42 నుంచి 55 శాతం ఎక్కువగా ఉందట. 
* అలాగే, పెళ్లై జీవిత భాగస్వామితో విడిపోయిన వారు, ఒంటరిగా జీవించే వారిలో గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయట. 
* పురుషుల్లో పోలిస్తే మహిళల్లో స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయట.
* ఈ పరిశోధన యూరోప్‌, ఉత్తర అమెరికా, మధ్య ఆసియా దేశాల్లో వివిధ జాతులకు, సంస్కృతులకు చెందిన వ్యక్తులపై జరిపారు.
* పెళ్లై జీవిత భాగస్వామితో కలిసి జీవించే వారు తమ జీవితానికి భద్రత ఉందన్న భరోసాతో ఎక్కువగా ఒత్తిడికి లోనుకావడం లేదట. 
* ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేతోడు ఉందనే భరోసా ఉన్నవారు మానసికంగా ఉల్లాసంగా ఉన్నారట. 
* ఈ కారణంగానే స్ట్రోక్‌ బారి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. 
* అదేసమయంలో సహజీవనం చేసే వారిలో పెళ్లి అనే బంధంలేని కారణంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
* ఈ పరిశోధన రాయల్‌ స్ట్రోక్‌ ఆస్పత్రి కార్డియాలజీ విభాగం పరిశోధకులు నిర్వహించి, ఫలితాలను మెడికల్‌ జర్నల్‌ హర్ట్‌ నివేదికలో పొందుపరిచారు. 
* సో.. "డోంట్‌ మ్యారీ.. బీ హ్యాపీ" అనే సినీ పాట పాడుకునే బ్యాచిలర్లు ఇక ఆ ధోరణి నుంచి బయటపడాలంటున్నారు పరిశోధకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విష వాయువు పీల్చి... జార్జియాలో 12 మంది మృతి

రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు విరుద్ధం : కాంగ్రెస్

జమిలి ఎన్నికల బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

తర్వాతి కథనం
Show comments