ప్రతిరోజూ ఎండుద్రాక్షాలు తీసుకుంటే? పక్షవాతాన్ని నివారించవచ్చా?
కిస్‌మిస్ లేదా ఎండుద్రాక్ష అని పిలిచే ఈ డ్రైఫ్రూట్స్ రుచికరమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. 100 గ్రాముల ఎండుద్రాక్షాల్లో 249 క్యాలరీలతో పాటు పీచుపదార్థాలు, రకరకాల లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కు
కిస్‌మిస్ లేదా ఎండుద్రాక్ష అని పిలిచే ఈ డ్రైఫ్రూట్స్ రుచికరమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. 100 గ్రాముల ఎండుద్రాక్షాల్లో 249 క్యాలరీలతో పాటు పీచుపదార్థాలు, రకరకాల లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. నొప్పి, మంటని తగ్గించడంతో పాటు క్యాన్సర్లను నివారించే శక్తి ఈ ఎండుద్రాక్షాలకు ఉంటుంది.
ముఖ్యంగా అది మెలనోమా, పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్లను నివారిస్తుందని పరిశోధనలో తెలియజేస్తారు. ఎందుద్రాక్షాలు అనేక రకాల ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. రక్తనాళాలను, హార్మోన్స్ స్రావాలను తగ్గించి పక్షవాతాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా హైబీపీ కూడా నివారితమవుతుంది.
ఎండుద్రాక్షాల్లో క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నిషియం, కాపర్, జింక్ వంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి. ఐరన్ ఇందులో పుష్కలంగా ఉండడం వలన గుండెజబ్బులను నివారించడానికి తోడ్పడుతుంది. ఇందులోని విటమిన్స్ అంశాలు రోగనిరోధక శక్తిని పెంచుటకు సహాయపడుతాయి. 100 గ్రాముల ఎండుద్రాక్షాల్లో 749 మి.గ్రా. పొటాషియం ఉంటుంది.