Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్సర్ అణిచేందుకు వంటింటి చిట్కాలు...

ప్రతి ఒక్కరూ నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు వివిధ రకాల ఆహార పదార్థాలను ఆరగిస్తుంటాం. వీటిలో ద్రవపదార్ధాలతో పాటు ఘన పదార్ధాలూ ఉంటాయి. వీటిలో కొన్ని రకాల ఆహార పదార్థాలు జీర్ణంకాకపోవచ్చు.

అల్సర్ అణిచేందుకు వంటింటి చిట్కాలు...
, మంగళవారం, 10 జులై 2018 (13:35 IST)
ప్రతి ఒక్కరూ నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు వివిధ రకాల ఆహార పదార్థాలను ఆరగిస్తుంటాం. వీటిలో ద్రవపదార్ధాలతో పాటు ఘన పదార్ధాలూ ఉంటాయి. వీటిలో కొన్ని రకాల ఆహార పదార్థాలు జీర్ణంకాకపోవచ్చు. తద్వారా కడుపులో మంట ఏర్పడుతుంది. వికారంగా ఉంటుంది. ఇలా ఎందుకొస్తుందో తెలీదు. కొందరికి కడుపు ఖాళీ అయితే నొప్పి వస్తుంది. మరి కొందరికి కడుపు నిండితే నొప్పుపుడుతుంది. 
 
వీటన్నింటికీ కారణం అల్సర్. ఈ సమస్య బారినపడటానికి కారణం మారిన జీవనశైలే. కాలంతో పరుగులు, వేళకు తీసుకోని ఆహారం, ఒకవేళ తీసుకున్నా హడావిడిగా.. గబగబా తినేయటం.. చీటికి మాటికి చిరాకు, అకారణం లేకుండానే కోపం, టెన్షన్, వీటితోపాటు నిత్యం ఎదుర్కొనే రకరకాల మానసిక ఒత్తిళ్ళు తోడుకావడంతో జీర్ణకోశంలో అల్సర్ సమస్యలను పెంచుతున్నాయి. అలాంటి అల్సర్ సమస్యకు ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలు పాటించవచ్చు. 
 
* అల్సర్‌తో బాధపడుతున్న వారు ప్రతి రోజూ ఉదయాన్నే తేనెను అల్పాహారంతో పాటు ఒక చెంచా తేనె తీసుకోవాలి. 
* అరటి పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ పదార్థం కడుపులో వచ్చే పుండ్లు పెరగకుండా చేస్తుంది. 
* విటమిన్ 'ఇ' ఎక్కువగా ఉండే బాదం, చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి అల్సర్లను అణచివేస్తాయి. 
* నిమ్మ, ద్రాక్ష వంటి పుల్లటి పండ్ల రసాలను తాగడం ద్వారా అల్సర్ల నొప్పి నుంచి బయటపడొచ్చు. 
* ఇవి పుల్ల‌ని పండ్లే అయిన‌ప్ప‌టికీ శ‌రీరంలోకి వీటి ర‌సం చేరాక ఆల్క‌లైన్ స్వ‌భావాన్ని కలిగి అల్సర్‌ను దరిచేరనీయవు.
* వెల్లుల్లికి కడుపు మంటని తగ్గించే గుణం ఉంటుంది. భోజన సమయంలో కొంచెం వెల్లుల్లి తింటే కూడా అల్సర్ తగ్గుతుంది.
* ప్రతిరోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు, మూడు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిని ఒక టీస్పూన్ తేనె తాగాలి.
* ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల అల్స‌ర్లు త‌గ్గుముఖం పడతాయి.  
* అన్నింటికంటే ముఖ్యంగా తీసుకునే ఆహారం ఏదైనప్పటికీ ఖచ్చితమైన సమయంలోనే తీసుకోవాలి. 
* అనారోగ్యం కలిగించే ఆహారాలకు దూరంగా వుండాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లికి మేకప్ ఎలా వేసుకోవాలంటే?