Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్సర్ వ్యాధితో బాధపడుతుంటే... ఇలా చేస్తే సరి...

కొంతమంది అల్సర్‌ వ్యాధితో చాలా బాధపడుతుంటారు. ఇది గ్యాస్టిక్ సమస్యలే అనుకుని అలాగే ఉండిపోతారు. ఇదేదోనని వదిలేస్తే కడుపులో రంధ్రం పడి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశముంది. శరీరంలోని కీలక భాగలన్నీ

అల్సర్ వ్యాధితో బాధపడుతుంటే... ఇలా చేస్తే సరి...
, సోమవారం, 2 జులై 2018 (10:32 IST)
కొంతమంది అల్సర్‌ వ్యాధితో చాలా బాధపడుతుంటారు. ఇది గ్యాస్టిక్ సమస్యలే అనుకుని అలాగే ఉండిపోతారు. ఇదేదోనని వదిలేస్తే కడుపులో రంధ్రం పడి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశముంది. శరీరంలోని కీలక భాగలన్నీ దెబ్బతిని ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఎవరైనా యాంటాసిడ్ మాత్రలతో కాలయాపన చేయాలనిచూస్తే అల్సర్ క్యాన్సర్‌గా మారే ప్రమాదముంది.
అందుచేత అల్సర్ లక్షణాలు కనిపించిన మరుక్షణమే ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తే ఈ అల్సర్ వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ప్రతిరోజూ రాత్రివేళ సమయంలో ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే మంచిది. 
 
కొంతమంది స్త్రీలు ఉపవాసాల పేరిట, పని ఒత్తిళ్ల పేరిట ఎంతో మంది వారానికి నాలుగు రోజులు వేళకు ఆహారం తీసుకోకుండా అల్సర్ బారిన పడుతుంటారు. ఇలా చేయడం వలన రాత్రివేళ కడుపు నొప్పి, నిద్రలేమితో బాధపడుతుంటారు. దీంతో మెుత్తం జీవక్రియల్లోనే తేడా వస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ కూరగాయలు, పండ్లు, పాలు, సరైన ఆహారం తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు.
 
ఆయుర్వేద చికిత్సలో మెుత్తం జీర్ణవ్యవస్థను పెద్దప్రేగు, చిన్నప్రేగు వ్యవస్థలన్నింటినీ చక్కబరుస్తుంది. ప్రామాణికతను సంతరించుకోవడానికి ఆయుర్వేదం అండగా నిలబడుతంది. అల్సర్లకు చేసే ఆయుర్వేద చికిత్స రెండు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది జీర్ణ రసాల అధిక ఉత్పత్తిని నియంత్రించడం. రెండవది ఏర్పడిన అల్సర్‌ను మానిపోయే చికిత్స చేయడం. అలా మానిపించే ఔషధాలు రోపణ ద్రవ్యాలలో ఉంటారు.
 
శమన చికిత్సలో ఏర్పడిన అల్సర్‌ను తగ్గించే రోపన ద్రవ్యాలను వాడటం జరుగుతుంది. ఆమ్లపిత్తం అంటే పిత్తం ప్రకోపం చెందడమే అల్సర్లకు కారణం. రక్తస్రావం కూడా అల్సర్లలో సమస్యే కాబట్టి రక్తస్థంభక ద్రవ్యాలు, రక్తపిత్త హర చికిత్సలు కూడా ఉంటాయి. శోధన చికిత్సలో భాగంగా పాలకు పుండ్లను తగ్గించే శక్తి ఉండడం వలన పాలు ప్రధాన అంశంగా ఉండే క్షీరవస్తి చికిత్సలు కూడా చేయడం జరుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాస్మిన్ ఆయిల్‌ను వాడితే.. ఎంత హాయి..