Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లికి మేకప్ ఎలా వేసుకోవాలంటే?

మేకప్‌కి దూరంగా ఉన్నప్పటికి వివాహ వేడుకలకు తప్పనిసరి కావలసిన విషయం. ఇలాంటప్పుడు మేకప్ త్వరగా డల్ అవకుండా ఎక్కువసేపు ముఖం తాజాగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ఫేస్‌ప్యాక్‌తో ముఖాన్ని శ

పెళ్లికి మేకప్ ఎలా వేసుకోవాలంటే?
, మంగళవారం, 10 జులై 2018 (12:35 IST)
మేకప్‌కి దూరంగా ఉన్నప్పటికి వివాహ వేడుకలకు తప్పనిసరి కావలసిన విషయం. ఇలాంటప్పుడు మేకప్ త్వరగా డల్ అవకుండా ఎక్కువసేపు ముఖం తాజాగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ఫేస్‌ప్యాక్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఐస్ క్యూబ్‌తో ఒకసారి మృదువగా రబ్ చేసి కాటన్‌తో తుడిచేయాలి.
 
తరువాత ముడతలు, నల్లని మచ్చలు, కళ్లకింద నల్లని వలయాలు, నోటికిరువైపులా ఏర్పడ్డ లాఫింగ్ లైన్స్ కవర్ చేయడానికి లిప్టింగ్ సీరమ్ వాడాలి. ప్రైమర్ ఉపయోగించి ముఖమంతా కలిసేలా బ్రష్‌తో బ్లెండ్ చేయాలి. పూర్తయిన తరువాత వాటర్‌ప్రూఫ్ కన్నీలర్‌ను వాడాలి. చర్మతత్వం ప్రకారం ఎంపిక చేసుకున్న వాటర్ ‌ప్రూఫ్ ఫౌండేషన్‌ను ఉపయోగించాలి.
 
అంతా కలిసేలా పై నుండి క్రింది వరకు బ్రష్‌తో బ్లెండ్ చేయాలి. తరువాత పైన కంపాక్ట్ పౌడర్‌ను ఉపయోగించాలి. స్ప్రే బాటి‌ల్‌లో కొద్దిగా నీళ్లు పోసి ముఖం మీద స్ప్రే చేయాలి. స్పాంజ్‌తో అక్కడక్కడా రబ్ చేస్తూ కొద్దిగా డార్క్ చేయాలి. చెమట పట్టినా, నీళ్లు పడినా మేకప్ చెడిపోదు. ఫౌండేషన్ సెట్ అయ్యాకం కంటి భాగాన్ని తీర్చిదిద్దాలి.
 
కంటి చుట్టూ కలర్ బేస్ రాసి వేసుకున్న దుస్తుల రంగును బట్టి కంటి పైభాగంలో 2-3 షేడ్స్ రెప్పలకు వాడవచ్చు. కనుబొమల క్రింది భాగంలో లైట్‌షేడ్ వాడి వాటిని తీర్చిదిద్దాలి. తరువాత కళ్లకి ఐ లైనర్, మస్కారా, కనుబొమలకు ఐ బ్రో పెన్సిల్‌తో మేకప్ పూర్తి చేయాలి. బుగ్గల మీద బ్లష్ చేసుకోవాలి. ఈ మేకప్ 5-6 గంటల వ్యవధిలో తీసేయడానికి మేకప్ రిమూవర్‌ని మాత్రమే ఉపయోగించాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోళ్లు అందంగా కనిపించాలంటే?