నారింజ తొక్కల పొడిని ముఖానికి రాసుకుంటే?
చెంచా వెనిగర్‌లో మూడు చెంచాల నీళ్లను కలుపుకుని దూదిని అందులో ముంచి ముఖానికి రాసి 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి. దాల్చిన చెక్కలో ఉంజే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెుటిమలకు కారణమ
చెంచా వెనిగర్‌లో మూడు చెంచాల నీళ్లను కలుపుకుని దూదిని అందులో ముంచి ముఖానికి రాసి 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి. దాల్చిన చెక్కలో ఉంజే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెుటిమలకు కారణమైన బ్యాక్టీరియాలను చంపేస్తాయి. రెండు చెంచాల తేనె, చెంచా దాల్చిన చెక్కపొడి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. తేనెలో పాలు కలిపి ముఖానికి పట్టించి పావుగంట తరువాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. బొప్పాయి జిడ్డుని తొలగించి మెుటిమలు రాకుండా అడ్డుకుంటుంది.
దీనికోసం బాగా పండిన బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. రెండు చెంచాల నారింజ తొక్కల పొడికి తగినన్ని నీళ్లు చేర్చి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన మెుటిమలు తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది.
అరటిపండు తొక్కని ముఖంపై వలయాకారంగా 15 నిమిషాల పాటు రుద్దుకోవాలి. అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. పచ్చి బంగాళాదుంపని ముక్కలుగా కోసి ఆ ముక్కతో ముఖంపై మలయాకారంగా 10 నిమిషాల పాటు రుద్దాలి. ఆరాక వెచ్చని నీళ్లతో కడిగేస్తే మెుటిమలు తగ్గుముఖం పడుతాయి.