Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మష్రూమ్స్‌తో మంచూరియానా? ఎలా?

పుట్టగొడుగులు తినడం వలన గుండె జబ్బులు డయాబెటిస్, క్యాన్సర్ వ్యాధులు నిరోధించబడుతాయి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్‌కు కూడా పుట్టగొడుగులు బలమైన శ్రేష్టమైన ఆహారంగా సహాయపడుతాయి. మరి ఇటువంటి పుట్టగొడుగులతో మం

Advertiesment
మష్రూమ్స్‌తో మంచూరియానా? ఎలా?
, బుధవారం, 11 జులై 2018 (12:49 IST)
పుట్టగొడుగులు తినడం వలన గుండె జబ్బులు డయాబెటిస్, క్యాన్సర్ వ్యాధులు నిరోధించబడుతాయి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్‌కు కూడా పుట్టగొడుగులు బలమైన శ్రేష్టమైన ఆహారంగా సహాయపడుతాయి. మరి ఇటువంటి పుట్టగొడుగులతో మంచూరియా ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
మష్రూమ్స్‌ - 200 గ్రా 
మిరియాల పొడి - స్పూన్ 
బియ్యప్పిండి - 3 స్పూన్స్
మైదా - 3 స్పూన్స్ 
కార్న్‌ఫ్లోర్‌ - 3 స్పూన్స్ 
ఉప్పు - తగినంత 
కారం - స్పూన్ 
నీరు - అరకప్పు 
నూనె - సరిపడా 
ఉల్లిపాయలు - 2 
వెల్లుల్లి రెబ్బలు - 4 
సోయా సాస్‌ - 2 స్పూన్స్ 
పచ్చిమిర్చి - 4
టమోటా సాస్‌ - 1 స్పూన్ 
టమోటా ప్యూరీ - 2 స్పూన్స్ 
కొత్తిమీర తరుగు - అలంకరణకు
 
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్‌, మైదా, కారం, ఉప్పు వేసి నీటితో జారుగా కలుపుకోవాలి. రెండు ముక్కలుగా తరిగిన మష్రూమ్స్‌ను ఆ మిశ్రమంలో ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో రెండు స్పూన్స్ నూనె వేసి ఉల్లి తరుగు, పొడుగ్గా చీరిన పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు చిటికెడు ఉప్పు వేసి వేగించాలి. ఆ తరువాత సోయా సాస్‌, టమోటా ప్యూరీ, సాస్‌ వేయాలి. రెండు నిమిషాల తరువాత పక్కనుంచిన మష్రూమ్స్‌ వేసి చిక్కబడేవరకు ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే మష్రూమ్స్ మంచూరియా రెడీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెుటిమలతో బాధపడుతున్నారా? ఓట్స్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?