Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీపీని పరీక్షించుకోవడం ఎలాగంటే..?

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (17:11 IST)
మనిషన్నాక ఏదో ఒక జబ్బు ఎప్పుడో ఒకప్పుడు వేధిస్తూనే ఉంటుంది. వాటిలో ముఖ్యమైన సమస్య రక్తపోటు.. అదే బీపి. చాలామంది నెలకు రెండు మూడు సార్లైనా బీపీ చెక్ చేసుకుంటుంటారు. ఐతే బీపీ ఎక్కువగా ఉందని బాధపడుతుంటారు. కానీ బీపీ పరీక్షించుకోబోయే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. 
 
1. బీపీ పరీక్ష చేయించుకునేటప్పుడు మీరు కూర్చునే విధానం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ వెనకాల సపోర్టు తప్పనిసరిగా ఉండాలి. కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చోవాలి. పాదాలను రెండింటిని నేలపై ఆనించి ఉంచాలి. బీపీ చూసే చేతిని టేబుల్‌పై విశ్రాంతిగా ఉంచాలి. మోచేతి‌పై భాగం ఛాతి మధ్య భాగానికి వచ్చేలా చేతినివుంచాలి. 
 
2. రక్త పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళేముందు కనీసం అరగంటకు ముందు‌గానే కాఫీలు , టీలు, సిగరెట్లు తీసుకోకూడదు. ఇవన్నీ తాత్కాలికంగా బీపీని పెంచుతాయి. 
 
3. పరీక్ష చేయించుకునేటప్పుడు ఎవరూ మాట్లాడకూడదు. మాట్లాడినా, విన్నా మనకు తెలియకుండానే స్వల్ప వత్తిడి పెరుగుతుంది. దీని వలన ఖచ్ఛితమైన బీపీ విలువ తెలుసుకోవడం సాధ్యం కాదంటున్నారు వైద్యనిపుణులు. 
 
4. ఆందోళనలూ పెట్టుకోకూడదు. ఆ సమయంలో మూత్రవిసర్జనను ఆపుకోవడంలాంటి చిన్నచిన్న వత్తిళ్లకు కూడా దూరంగా వుండాలి.
 
5. రెండు చేతులకూ పరీక్ష చేయించడం ఉత్తమం. రెండింటికీ నడుమ కనీసం 20 పాయింట్లు తేడా రావచ్చు. రెండింటిలోనూ ఎక్కువగావున్న దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

US Elections 2024: కొనసాగుతున్న పోలింగ్.. కమలా హారిస్, ట్రంప్ ఏమన్నారంటే...

హైదరాబాద్‌లో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024

సమాజ సేవ ద్వారా ఐక్యతను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్

పవన్ కల్యాణ్ చిన్నపిల్లాడి లెక్క మాట్లాడితే ఎలా?: మందక్రిష్ణ మాదిగ

కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్- రాహుల్ గాంధీ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తర్వాతి కథనం
Show comments