Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూరిన్‌కి వెళ్ళకుండా ఆపుకున్నారో..? కిడ్నీలో స్టోన్స్ తప్పవ్..

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (12:19 IST)
యూరిన్‌కు వెళ్ళకుండా బిగపట్టుకుంటే చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పనుల్లో పడి కొందరు.. పరిశుభ్రత లేని బాత్రూమ్‌లను వాడకూడదని తలచి కొందరు యూరిన్‌కు వెళ్ళకుండా బిగపట్టుకుంటారు. అలాంటి వారు మీరైతే ఇన్ఫెక్షన్లు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


అవాంఛిత ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే.. యూరిన్‌కి వెళ్లాలనే సంకేతం వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి. వెళ్లకుండా అలాగే బిగపట్టుకుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తప్పవు. యూరిన్‌లో క్రిములు ఎక్కువగా ఉంటాయి. 
 
అవి మూత్రాశయంలో ఎక్కువ సేపు వుంటే.. ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కాబట్టి యూరిన్ సంకేతం వచ్చిన వెంటనే వెళ్లాలి. ఎక్కువసేపు యూరిన్‌కి వెళ్లకుండా ఆపుకుంటూ ఉంటే కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడతాయి. చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతాయి. కానీ యూరిన్‌కి వెళ్లకుండా ఆపుకుంటే రాళ్లు పెద్దగా అవుతాయి. 
 
కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడకుండా ఉండాలంటే ఎక్కువ మోతాదులో నీళ్లు తాగాలి. శరీరం సూచించినప్పుడు యూరిన్‌కు వెళ్లాలి. దీనివల్ల కిడ్నీల్లో ఉన్న ఎలాంటి వ్యర్థాలనైనా తొలగించుకోవచ్చు. యూరిన్ ఆపుకుంటే బ్లాడర్‌కే దెబ్బేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments