Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుప్పెడు స్ట్రాబెర్రీలను రోజూ తీసుకుంటే..?

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (12:06 IST)
స్ట్రాబెర్రీల్లోని ఫ్లేవనాయిడ్‌లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. వీటిలో మాంగనీస్, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ గుప్పెడు స్ట్రాబెర్రీలను మిల్క్ షేక్స్, సలాడ్స్‌లలో వేసుకుని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. 
 
అలాగే కంటి ఆరోగ్యానికి క్యారెట్స్, స్ట్రాబెర్రీలు చాలా ఉపయోగపడుతాయి. ముఖ్యంగా స్ట్రాబెర్రీలను తరుచుగా ఆహారంగా తీసుకోవడం వలన కంటి ఆరోగ్యానికి మంచిగా దోహదపడుతుంది. కొంతమంది చిన్న వయస్సులోనే కంటి చూపును కోల్పోతుంటారు. అటువంటివారికి స్ట్రాబెర్రీ పండ్లు చక్కటి ఔషధంగా సహాయపడుతాయి.
 
ఈ పండ్లలో గల యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. గర్భిణులకు కావలసిన ముఖ్యమైన పోషకం ఫోలిక్ యాసిడ్. ఈ పదార్థం గర్భంలోని శిశువు వెన్నెముక సంబంధిత లోప సమస్యలను నివారిస్తుంది. అందుకే స్ట్రాబెర్రీలను గర్భిణీలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఈ ఫోలిక్ యాసిడ్ ఎర్రరక్తకణాలు వృద్ధిచెందడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి సమర్థంగా పనిచేస్తుంది. చర్మం మీద దద్దుర్లు, తలనొప్పి, నిద్రలేమి, అలర్జీ వంటి సమస్యలు గల వారు మాత్రం ఎట్టిపరిస్థితులలోనూ స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments