Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేసిన తర్వాత ఇలా చేస్తే..?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (15:31 IST)
కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మొక్కజొన్న గింజలు, చిక్కుళ్లు, పప్పులు తీసుకోవడం మంచిది కాదు. ఆకలిగా వున్నప్పుడు తీసుకోవచ్చు. లేత గింజల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వందగ్రాముల మొక్క జొన్నల్లో 365 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది.
 
మొక్కజొన్నల్లో గ్లూటిన్, సెల్యూలోజ్, పీచు పదార్థాలు ఉన్నాయి. ఇవి పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపి.. మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. చక్కెర వ్యాధితో బాధపడేవారు, బరువు తగ్గాలనుకొనేవారు ఈ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధికి అడ్డుపడతాయి. గుండె పనితీరు సక్రమంగా ఉంటుంది.
 
గింజల్లో కొవ్వు పదార్థాలు అంటే వెన్న, నూనె, క్రీమ్ వంటివి వేయకుండా తింటే త్వరగా అరుగుతాయి. వీటిలో ఉండే నూనెలు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అలానే పొత్తుల చివరన ఉండే పీచు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ నల్లటి పీచును ఉడికించి ఆ నీళ్లను వడకట్టి తీసుకుంటే మూత్రాశయానికి సంబంధించి ఏ ఇబ్బందులూ ఉండవు. వీటిని ఇతర ఏ పదార్థాల్లోనూ కలిపి తీసుకోకూడదు. తీసుకున్న వెంటనే గోరువెచ్చటి నీళ్లు తాగడం తప్పనిసరి.
 
అరుగుదల సరిగా లేనివారు.. పాత బియ్యం, పెసలు, చేపలు, బాగా ఉడికిన మాంసం, లేత ముల్లంగి, వెల్లుల్లి, పచ్చిఅరటి, అనప, బీర, పొట్ల, వంకాయ, బీన్స్, క్యారెట్, దానిమ్మ, నారింజ, ఆవు పాలతో చేసిన మజ్జిగ వంటివి తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

ఏపీ ఎన్నికల ప్రచారంలో కనిపించని అలీ.. కారణం శివాజీయేనా?

జైలులో భర్త.. భర్త తమ్ముడితో పెళ్లి.. ఏడు నెలల పసికందు హత్య.. ఎలా?

వాష్ బేసిన్ నుండి నీళ్లు త్రాగవలసి వచ్చింది.. ముద్రగడ ఆవేదన

తెలంగాణలో అత్యధికంగా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రెండు భాగాలు, మూడు పాత్రల టీనేజ్ లవ్ స్టోరీతో ఎస్ కే ఎస్ క్రియేషన్స్ చిత్రం

సమంత, రాజ్ & డికె లాంచ్ చేసిన అనుపమ పరమేశ్వరన్ 'పరదా' ఫస్ట్ లుక్

ఆడ పిల్లనే అయితే ఏంటట ? అంటూ ప్రశ్నిస్తున్న పోలీస్‌ఆఫీసర్‌ చాందిని చౌదరి యేవమ్‌ లుక్‌

తర్వాతి కథనం
Show comments