Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ నాలుగు పండ్లతో వేసవిలో మెరుపులే మెరుపులు....

ఈ నాలుగు పండ్లతో వేసవిలో మెరుపులే మెరుపులు....
, గురువారం, 28 మార్చి 2019 (22:43 IST)
ప్రతి రోజూ ఒక కప్పు పండ్ల జ్యూస్ తాగితే మన చర్మం నిగారింపు వస్తుందనే విషయం మనకు తెలిసిందే. అయితే పండ్ల రసాన్ని ఫేషియల్ గా ఉపయోగిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. చాలామంది చర్మ సౌందర్యం కోసం ఖరీదైన లోషన్లు, క్రీములను ఎక్కువగా వాడడం వల్ల రసాయనాలతో దుష్ప్రభావం బారిన పడే ప్రమాదం ఉంది. ఇంట్లోనే కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే చర్మ సంరక్షణ సులభంగానే సాధ్యపడుతుంది. 
 
ఆయా సీజన్లలో లభించే తాజాపండ్లను తినడానికే కాదు చర్మ సౌందర్యం పెంచుకునేందుకు కూడా వాడవచ్చు. విలువైన పోషకాలున్నందున పండ్ల గుజ్జును ముఖానికి, శరీరంలోని ఇతర భాగాలకూ రాసుకుంటే చర్మం మిలమిల మెరుస్తుంది. అరటి, ఆరెంజ్, యాపిల్, మామిడి వంటి పండ్లు చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడతాయి.
 
1.అరటిపండు  ప్రతి ఒక్కరికీ సంవత్సరం మొత్తం లభించే పండు ఇదొక్కటే. ఇందులో ఉంటే ఐరన్, మెగ్నిషియం, పోటాషియం వంటివి చర్మ నిగారింపునకు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే అరటి పండులో ఏ, బీ, ఈ విటమిన్స్ ఫుష్కలంగా ఉంటాయి. అందువల్ల దీంతో మీ చర్మం మంచి రంగులోకి మారడానికి అవకాశం ఉంటుంది. 
 
2.  నిమ్మలో ఉండే విటమిన్ సి చర్మం అందంగా కావడానికి ఉపయోగపడుతుంది. ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాస్ వేడి నీళ్లలో నిమ్మ, తేనే కలిపి తాగితే చర్మం నిగనిగలాడుతుంది. చర్మ లోపలి కణాలలోని నల్లటి మచ్చలను, ముడతలను పోగొడతాయి. అలాగే మోచేతులు, నల్లవలయాలు ఉంటే ఇతర  ప్రాంతాల్లో నిమ్మతో రుద్దితే చర్మం అందంగా తయారవుతుంది. 
 
3. యాపిల్  పండు వల్ల వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. సాధారణమైన చర్మం కలవారికి యాపిల్‌తో చేసిన ఫేస్‌ప్యాక్ ఉపయోగకరంగా ఉంటుంది. యాపిల్ పండును చిన్న, చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మిశ్రమాన్ని తయారు చేసుకోండి. తర్వాత ఇందులో కాస్త తేనె, రోజ్ వాటర్ కలుపుకోండి. ఆ తర్వాత ఆ ఫేస్‌ప్యాక్‌ను మీ చర్మంపై పూయండి. ఇలా కొన్నిరోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే, నల్లటి మచ్చలు తొలగిపోయి చర్మం మంచి నిగారింపు రెట్టింపు అవుతుంది. చర్మం పొడిబారడం, పగుళ్లు వంటి సమస్యలుండవు. 
 
4.బొప్పాయి : చర్మ సౌందర్యానికి ఈ పండు ఎంతో ఉపయోగపడుతుందని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. చర్మ నిగారింపునకు మన పూర్వీకుల నుంచి ఈ పండును ఉపయోగిస్తున్నారు. ఈ పండు రసాన్ని ముఖానికి ఫేస్‌ప్యాక్‌ గా వేసుకోవచ్చు. ముఖంపై ఏర్పడిన మచ్చలకు, మొటిమలకే కాక, వివిధ చర్మ వ్యాధులను తగ్గించేందుకు ఇది చక్కగా పని చేస్తుంది. చర్మంలో ఏర్పడే మృత కణాలను, మృత చర్మాన్ని పోగొడుతుంది. చర్మం మరింత ప్రకాశించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దగ్గరికెళితే నలిగిపోతావు వద్దులే అంటున్నాడు... ఏం చేయాలి?