నెయ్యిని తీసుకుంటే ఏమేమి ప్రయోజనాలు? (Video)

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (18:16 IST)
నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరిగి ఆరోగ్యానికి హాని కలుగుతుందని చాలా మంది అపోహపడతారు. దాని జోలికి వెళ్లడం మానేస్తారు. కానీ తగిన మోతాదులో తీసుకుంటే నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక టీస్పూన్ నెయ్యి త్రాగడం అలవాటు చేసుకుంటే కలిగే మంచి ఫలితాలు అన్నీ ఇన్నీ కావు. నెయ్యి త్రాగిన తర్వాత గోరు వెచ్చటి నీళ్లు త్రాగాలి.
 
పరగడుపున నెయ్యి తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి, ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. మలబద్దకం, గ్యాస్, అసిడిటీతో బాధపడేవారు దీనిని తప్పక తీసుకోవాలి. అలాగే ఈ కాలంలో కంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. నెయ్యిని తీసుకోవడం వల్ల విటమిన్ ఏ పుష్కలంగా లభించి కంటి అనారోగ్యం దూరం అవుతుంది. నిజం చెప్పాలంటే నెయ్యి తినడం వల్ల స్థూలకాయం వస్తుందనేది అపోహ మాత్రమే, ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచదు, మంచి కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులను దరి చేరనివ్వకుండా కాపాడుకోవచ్చు. 
 
గర్భిణీ స్త్రీలు కూడా నెయ్యి తీసుకుంటే అనేక ముఖ్యమైన పోషకాలు అందుతాయని నిపుణుల సూచన. కడుపులోని పిండం ఎదుగుదలకు దోహదపడుతుంది. రోజూ నెయ్యి తింటే ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు పోయి ముఖం కాంతివంతంగా వెలుగుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు నెయ్యిలో అధికంగా ఉండటం వల్ల గాయాలు తగిలినా, పుండ్లు ఏర్పడినా త్వరగా తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్‌ల నుండి కూడా రక్షణ ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ డి ఎముకల బలానికి తోడ్పడుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments