Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు ఎత్తు పెరగాలంటే..? మటన్, చికెన్‌తో పాటు..?

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (18:02 IST)
పిల్లలు ఎత్తు పెరగాలంటే.. ప్రోటీన్లు, క్యాల్షియం చాలా అవసరం. పిల్లలు సరైన మోతాదులో చికెన్, మటన్ వంటివి తీసుకుంటే కండరాల పెరుగుదలకు బాగా ఉపకరిస్తాయి. రోజుకో గుడ్డును తప్పక తీసుకునేలా చేయాలి. ఇక క్యాల్షియం కోసం పాలు తప్పకుండా ఆహారంలో భాగం చేయాలి. పాలలో విటమిన్ డి, ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి కాబట్టి.. రోజూ మూడు గ్లాసుల పాలను పిల్లలకు ఇవ్వడం చేయాలి. తద్వారా పిల్లలు ఎత్తుగా పెరుగుతారు.
 
ఇంకా సోయా ఉత్పత్తులను డైట్‌లో చేర్చుకోవడం ద్వారానూ పిల్లలు ఎత్తుగా పెరుగుతారు. సోయా మిల్క్ కూడా రోజుకో కప్పు లేదా గ్లాసు పిల్లలకు అందించడం చేయాలి. కేవలం మాంసాహారమే కాకుండా ఆకుకూరలు రోజుకో కప్పు మోతాదులో పిల్లలకు ఇవ్వాలి. మాంసాహారం తీసుకోని రోజు.. పిల్లల ఆహారంలో ఆకుకూరలు వుండాలి. వీటిల్లో వుండే విటమిన్స్ ఎముకలను బలపరచి, కండరాలను పెరిగేలా చేస్తాయి. 
 
ముఖ్యంగా బచ్చలి కూరను పిల్లలకు శాండ్ విచ్ వంటి స్నాక్స్‌లో చేర్చి ఇవ్వడం చేస్తే ఇష్టపడి తింటారు. ఇందులోని ఐరన్, క్యాల్షియం, ఫైబర్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాగే కూరగాయలన్నింటినీ చేర్చి సూప్ ద్వారా పిల్లలకు అందించడం ద్వారా కూడా పిల్లలు ఎత్తు పెరుగుతారు. వీటిలో బెండకాయను అస్సలు మరిచిపోకూడదు. 
 
బెండలో ప్రోటీన్స్, క్యాల్షియం, విటమిన్ ఎ, బి, డిలు వున్నాయి. ఫైబర్, పిండి పదార్థాలు, ఖనిజాలు కూడా వీటిలో పుష్కలంగా వున్న కారణంగా వారానికి మూడు సార్లు పిల్లల డైట్‌లో బెండకాయను చేర్చాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments