Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పండు తింటే రొమ్ము కేన్సర్ ప్రమాదం తక్కువ (video)

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (23:44 IST)
మహిళల్లో ఋతుక్రమం ఆగిన తర్వాత రొమ్ము కేన్సర్ వచ్చే కేసులు ఎక్కువగా వుంటుంటాయి. అత్తి పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ రొమ్ము కేన్సర్‌కు వ్యతిరేకంగా రక్షణను అందిస్తుంది. సగటున 51 మంది రుతుక్రమం ఆగిన మహిళలను 8.3 సంవత్సరాల పాటు అధ్యయనం చేస్తే అత్తి పండ్లు తినని వారికంటే తినే వారిలో రొమ్ము కేన్సర్ ప్రమాదం 34% తగ్గిందని తెలిసింది. అదనంగా హార్మోను మార్పిడి, చాలా ఫైబర్, ప్రత్యేకించి తృణధాన్యాల ఫైబర్ ఉపయోగించిన స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రిస్క్ 50% వరకు తగ్గింది. ఆపిల్, డేట్స్, అత్తి పండ్లు, బేరి మరియు ప్రూనే వంటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

 
మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు అధిక ఫైబర్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అత్తి చెట్టు యొక్క ఆకులు ఫైబర్ ఎక్కువగా ఉండి తినదగిన భాగాలలో ఒకటి. ఇన్సులిన్ సూది మందు తీసుకోనే మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవసరమైన ఇన్సులిన్ మొత్తం తగ్గించగల యాంటి బయాటిక్ లక్షణాలు అత్తి ఆకులు కలిగి ఉంటాయి. మధుమేహం తగ్గించడానికి మరియు ఇన్సులిన్ ఇంజక్షన్లు తగ్గించదానికి అత్తి ఆకులు నుంచి తయారుచేసిన రసంను అల్పాహారంలో చేర్చండి.

 
ప్రజలు ఉప్పు రూపంలో ఎక్కువగా సోడియంను తీసుకుంటారు. అధిక సోడియం, తక్కువ పొటాషియం తీసుకోవడం వలన రక్తపోటుకు దారితీయవచ్చు. పొటాషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అత్తి పండ్లలో పొటాషియం అధికంగా, సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి అది రక్తపోటుకు దూరంగా ఉంచటానికి సహకరిస్తుంది.

 
అత్తి పండ్లు జీర్ణ వ్యవస్థ కొరకు సమర్థవంతముగా పనిచేస్తాయి. ఇది మంచి జీర్ణక్రియను అందించటం కొరకు మరియు శరీరం యొక్క జీవక్రియను మెరుగుపరుస్తుంది. మూలశంక వ్యాధితో బాధపడేవారు అత్తి పండ్లను ప్రతి రోజు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

 
కిడ్నీ సమస్య: అత్తి పండ్లలో ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో కలిగి ఉండుట వలన మూత్రపిండ సంబంధిత వ్యాధి లేదా పిత్తాశయం సమస్యతో బాధపడేవారు అత్తి పండ్లను తినకూడదు. ఒకవేళ తింటే తీవ్రమైన బెవరేజెస్‌కు కారణమవుతుంది. కాబట్టి మూత్రపిండ సమస్యలు ఉన్నవారిని ఈ పండు తినకుండా నివారించాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments