Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కారణాలు ఇవే, కొవ్వు పెరిగితే చాలా డేంజర్

Advertiesment
belly fat
, బుధవారం, 17 ఆగస్టు 2022 (23:34 IST)
సన్నగా ఉన్నవారికి బెల్లీ ఫ్యాట్ మొదట్లో ఫర్వాలేదని అనిపిస్తుంది. ఐతే ఈ కొవ్వు పొత్తికడుపు లోపల లోతుగా నిల్వ చేయబడుతుంది. అంతర్గత అవయవాలను చుట్టుముట్టడం వలన ఇది కనిపించే దానికంటే చాలా ప్రమాదకరమైనదిగా మారుతుంది. పొట్ట వద్ద చేరిన కొవ్వు అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, స్లీప్ అప్నియా, ఇంకా అనేక ఇతర ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది.


సోమరితనం, ఒత్తిడికి లోనవుతున్నవారు, భోజనం మానేయడం, ఆలస్యంగా నిద్రపోవడం లేదా అతిగా తినడం చేస్తుండేవారిలో పొట్ట కొవ్వు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించడం, తగినంత నీరు త్రాగడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు.

 
ఆయుర్వేదం ప్రకారం బాగా వండినటువంటి తాజాగా వేడి సమతుల్య, సమయానుకూల ఆహారాన్ని సిఫార్సు చేస్తుంది. అలా భోజనాన్ని తీసుకోనట్లయితే కొవ్వును కరిగించే శరీర సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఒకేచోట గంటల తరబడి స్థిరంగా వుండే జీవనశైలి వల్ల బెల్లీ ఫ్యాట్ పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. ఎటువంటి శారీరక శ్రమ చేయకుంటే, 30 నిమిషాల పాటు దినచర్యకు యోగాను జోడించాలి.

 
నిద్ర లేమి కూడా పెరిగిన పొట్ట కొవ్వుతో ముడిపడి ఉంది. నిద్ర లేకపోవడం వల్ల అతిగా తినడం లేదా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల పొట్ట కొవ్వు లేదా ఊబకాయం ఏర్పడుతుందని చెపుతారు. మద్యపానం, ధూమపానం అధిక వినియోగంతో వ్యక్తి యొక్క జీవక్రియను నెమ్మదిస్తుంది. కనుక వాటికి దూరంగా వుండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేశ సంరక్షణకు ద్రాక్ష గింజల నూనె...