రోజుకు పది ముదురు కరివేపాకులను నమిలి మింగితే? (video)

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (17:31 IST)
మనం కూరల్లో, రసంలో ఉపయోగించే కరివేపాకును తినకుండా ప్రక్కన పడేస్తుంటాం. ఇలా మనం తెలియక చేస్తుండొచ్చు. కానీ కారివేపాకు వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకులో పలు రకాల ఔషదాలు, పోషకాలు దాగి ఉన్నాయి. ఇందులో మన శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. 
 
అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కరివేపాకులో కొవ్వు తగ్గించే గొప్ప గుణం ఉంది. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను పొడిని తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ కూడా గణనీయంగా తగ్గుతుంది. గర్భిణులు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే కడుపులో వికారం తగ్గుతుంది. 
 
ప్రతిరోజు పది ముదురు కరివేపాకు ఆకులను నమిలి మింగాలి. ఇలా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేయడం వలన మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది. పుల్లని పెరుగులో కొద్దిగా నీరు చేర్చి అందులో కరివేపాకు, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలోని అధిక వేడి తగ్గుతుంది.
 
కాలిన లేదా కమిలిన గాయాలకు కరివేపాకు గుజ్జు రాయడం వలన నొప్పి, గాయం త్వరగా తగ్గుతాయి. కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

iBomma రవి కేసు, బ్యాంక్ సహకారంతో రూ. 20 కోట్లు లావాదేవీలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

Meghana Rajput: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్టీరియస్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

తర్వాతి కథనం
Show comments