Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువతలో శృంగారంపై ఏహ్యభావ్యం ఎందుకు కలుగుతుంది?

యువతలో శృంగారంపై ఏహ్యభావ్యం ఎందుకు కలుగుతుంది?
, మంగళవారం, 20 ఆగస్టు 2019 (19:27 IST)
చాలా మంది యువకులు శృంగారంపై పెద్దగా ఆసక్తి చూపించరు. యుక్త వయసులో ఉండేవారు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇక పెళ్లైన భర్తల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మాయిలు, మహిళల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంటుంది. దీనికి కారణాలను శృంగార వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. 
 
చాలా మంది యువతీయువకులు ఇష్టపూర్వకంగానే దగ్గరవుతుంటారు. కానీ, శృంగార జీవితంలో మాత్రం సరైన తృప్తిని పొందలేకపోతున్నారు. దీనికి కారణం వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడమేనని అంటున్నారు. ఫలితంగా వారిలో శృంగార కోర్కెలు రోజురోజుకూ తగ్గిపోతుంటాయని వైద్యులు చెబుతున్నారు. 
 
ముఖ్యంగా యువకుల్లో అంగస్థంభన సమస్య ఉత్పన్నమవుతుంది. అమ్మాయిల్లోనూ శారీరక సంబంధం అంటేనే ఒక రకమైన ఏహ్యభావానికి లోనవుతున్నారు. శారీరక కారణాలు, వ్యాధులు లేనప్పుడు భాగస్వామి ప్రవర్తనే ప్రధానకారణంగా నిలుస్తుందంటున్నారు. ఒకవేళ శృంగార సమస్యలు ఉన్నా వాటి పరిష్కారంలో భాగస్వామి సహకారం లేకున్నా అవి ఎక్కువవుతాయని చెపుతున్నారు. 
 
నిరంతరం ఘర్షణ పడే యువతీయువకులు, దంపతులు తీవ్ర మానసిక ఒత్తిడికి, అశాంతికి లోనైనపుడు మనసే కేంద్రంగా పనిచేసే సాధారణ శృంగార చక్రం కలిగించే రసాయన, నాడీ, హార్మోన్ స్పందనలు కుంటుపడతాయని చెపుతున్నారు. దీంతో యువకులు లేదా మగవారిలో అంగస్థంభన లోపం, శీఘ్రస్ఖలనం వంటి సమస్యలు, స్త్రీలలో వెజెనిస్మస్, ఫ్రిజిడిటీ వంటి సమస్యలు కలుగుతాయని చెపుతున్నారు. 
 
పురుషులలో ఆధిపత్య ధోరణులు స్త్రీలలో ఆత్మనూన్యత, డిప్రెషన్‌కు దారితీసి వారిలో శృంగారంపై ఆసక్తిని తగ్గించివేస్తాయని చెపుతున్నారు. వరకట్న వేధింపులు, ఇంట్లో అత్త, ఆడబిడ్డల ఆధిపత్యం, చదువు-ఉద్యోగాలు కొనసాగించ లేకపోవడం, పిల్లల పెంపకం వంటివి స్త్రీలలో డిప్రెషన్‌ను కలిగిస్తాయని చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిలు డైటింగ్ కోసం కేటాయించే టైంమెంతో తెలుసా?