Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాగిజావను వారానికి నాలుగుసార్లు తాగితే..

రాగిజావను వారానికి నాలుగుసార్లు తాగితే..
, మంగళవారం, 20 ఆగస్టు 2019 (18:53 IST)
వయసు మీదపడేకొద్దీ అంద విహీనంగా తయారవుతుంటారు. ముఖ్యంగా, ఈ సమస్యను మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. 35 యేళ్లుదాటగానే మహిళల ముఖ చర్మంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. 
 
ముఖ చర్మంపై ముడతలు కనిపించడం, చర్మ వదులుకావడం, నిగారింపు తగ్గిపోవడం, నల్లగా మారిపోవడం, ముడతలు పడటం ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఈ సమస్యలు వేసవి కాలంలో ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో ముఖం పొడిబారిపోయినట్టుగా ఉంటుంది. 
 
వీటి నుంచి పరిష్కారం పొందాలంటో... చిన్నపాటి ఆరోగ్య సూత్రాలను పాటిస్తే చాలంటున్నారు బ్యూటీషియన్లు. వాతావరణంతో ఎలాంటి సంబంధం లేకుండా చల్లటి నీటితో స్నానం చేయటం ఉత్తమమని చెపుతున్నారు. అలాకాకుండా వేడినీటితో స్నానం చేస్తే చర్మం త్వరగా సాగిపోయి ముడుతలు పడే అకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. 
 
వీటితో పాటు.. సజ్జ రొట్టెలు, రాగిజావలను వారానికి కనీసం నాలుగు సార్లు, అలాగే సొరకాయ, బీర, పొట్లకాయ, గుమ్మడి, కీరదోస.. లాంటి కూరగాయలను ఎక్కువగా ఆరగించడం వల్ల చర్మానికి ఎంతగానో తోడ్పడుతాయని చెపుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిద్రను నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు. 
 
ఇకపోతే.. ప్రతి రోజూ మజ్జిగలో కాస్తంత జీలకర్ర వేసి రోజుకు రెండుసార్లు తీసుకుంటే చర్మానికి మేలు చేస్తుందని చెపుతున్నారు. మంచినీటిలో వట్టివేర్లను వేసుకుని తాగాలి. ఈ నీరు శరీరానికి చలువ చేయడమే కాకుండా, చర్మానికి కూడా మంచిదేనంటున్నారు. వీటితో పాటు.. బార్లీ, ఓట్స్‌లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తలనొప్పికి విరుగుడు.. అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి?