Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరోగ్యంగా వుండాలంటే.. టీవీ చూస్తూ భోజనం చేయకూడదట..

Advertiesment
Health
, గురువారం, 18 జులై 2019 (13:07 IST)
ఆరోగ్యంగా వుండాలంటే.. ఏకాగ్రత ముఖ్యం. ఏకాగ్రత కొరవడితే ఒత్తిడి తప్పదు. అందుచేత ఏకాగ్రతను పెంచుకోవాలి. ఏకాగ్రత అనేది పెరగాలంటే.. ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో మరింత శక్తి పెరుగుతుంది. అలాగే ఏకాగ్రత పెరిగేందుకు రోజూ కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేయండి 
 
ఆరోగ్యంగా ఉండేందుకు ఏకాగ్రతతో భోజనం చేయాలి. టీవీ చూస్తూనో లేదా కంప్యూటర్‌తో పనిచేస్తూనో భోజనం చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వార్తా పత్రికలు, పుస్తకాన్ని చదువుతూ భోజనం చేయకూడదు. దీంతో మీలో ఏకాగ్రత నశిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.  
 
వృత్తిని వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టకూడదు. ఈ రెండింటి మధ్య సత్సంబంధాలు కలిగి ఉండేందుకు ఏకాగ్రత చాలా అవసరం. ఇంకా జీవనశైలిని మార్చుకుంటే మీలో శక్తిసామర్థ్యాలు మరింతగా పెరుగుతాయి. దీంతో జీవితాంతం సుఖంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. 
 
అలాగే ప్రతి రోజు క్రమం తప్పకుండా రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నిద్రతో శరీరానికి మరింత శక్తిని అందించినవారవుతారు. నిద్రలేమితో ఒత్తిడి, కళ్ళకింద నల్లటి చారలు, అధిక రక్తపోటు తదితర సమస్యలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. కాబట్టి ప్రతి రోజు క్రమం తప్పకుండా కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొజ్జ కరగాలంటే.. వేపు పువ్వు పొడిని.. ఇలా వాడాలట..