Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్షాకాలంలో కారు నడుపుతున్నారా?

వర్షాకాలంలో కారు నడుపుతున్నారా?
, బుధవారం, 17 జులై 2019 (19:31 IST)
సాధారణంగా వర్షాకాలంలో వాహనాలు నడపుతున్నపుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షాకాలంలో రోడ్లపై నీళ్లు నిలిచివుంటాయి. దీంతో ఎత్తు పల్లాలు తెలియవు. రోడ్డు కిందకు దిగినట్టయితే బురదలో కూరుకునిపోయే ఆస్కారం ఉంది. 
 
అలాగే, టైర్లకు గ్రిప్ లభించక అదుపుతప్పి బోల్తాపడే అవకాశం ఉంది. అందుకే వర్షాకాలంలో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సలహా ఇస్తుంటారు. అయితే, వర్షాల్లో కారు డ్రైవింగ్ చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలను ఓ కార్ల కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. 
 
* వర్షాకాలంలో వాహనాలను బయటకు తీసేముందు కారు టైర్లను విధిగా ఒకసారి తనిఖీ చేయాలి. ఇలా చేయడం వల్ల మార్గమధ్యంలో సంభవించే దుర్ఘటనలను నివారించుకోవచ్చు. 
 
* టైర్లు బాగా అరిగిపోయి ఉన్నా, ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లపై గ్రిప్ లభించదు. పైగా, కారు యూజర్ మాన్యువల్‌లో పేర్కొన్నట్టుగా టైర్లలో గాలి ఉండేలా చూసుకోవాలి. 
 
* వర్షాకాలంలో కార్లలో ఉండే ఏసీ సెట్టింగ్స్ వల్ల దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఐడిల్ సెట్టింగ్స్ (సూచిన రీతిలో) ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల ఫ్రాస్టింగ్స్‌ను నివారించవచ్చు. అలాగే, పోర్టబుల్ వ్యాక్యూమ్ క్లీనర్‌ను కారులో పెట్టుకున్నట్టయితే వెసులుబాటునుబట్టి కారును శుభ్రం చేసుకోవచ్చు. 
 
* వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కారులోకి నీరు వస్తుంది. అందుకే వర్షాకాలంలో కారులో రబ్బర్ మ్యాట్స్‌ స్థానంలో ఫ్యాబ్రిక్స్ మ్యాట్స్ వాడటం ఉత్తమం. 
 
* వర్షంకురిసిన తర్వాత మనం వెళ్లాల్సిన మార్గం ఏ విధంగా ఉందో మ్యాప్స్ యాప్స్ సహాయం తీసుకోవాలి. 
 
* అన్నిటికంటే ప్రధానంగా వాహనం నడుపుతున్నపుడు ఎదురుగా రోడ్డు మార్గం స్పష్టంగా కనిపించాలంటే వైపర్స్ పక్కాగా పనిచేసేలా ఉంచుకోవాలి. కారు కొనుగోలు చేసినప్పటి నుంచి అవే వైపర్లను వినియోగిస్తుంటారు. వీటిని అపుడపుడూ మార్చుతూ ఉండాలి. లేకపోతే విజిబిలిటీ స్పష్టంగా కనిపించదు. 
 
ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వర్షాకాలంలో ప్రయాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ ఇండస్ట్రీని వదిలేస్తున్నా... కాపుల కోసం పని చేస్తానంటున్న నటి హేమ