Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త గూగుల్ అసిస్టెంట్ ఎంత వేగమో.. ఎంత స్మార్టో తెలుసా?

Advertiesment
కొత్త గూగుల్ అసిస్టెంట్ ఎంత వేగమో.. ఎంత స్మార్టో తెలుసా?
, బుధవారం, 8 మే 2019 (12:28 IST)
నూతన గూగుల్ అసిస్టెంట్ అతివేగవంతం, మరింత స్మార్ట్ కానుంది. ఇది వేగంగానే కాకుండా సామర్థ్యంతో కూడుకున్నది. కొత్త గూగుల్ అసిస్టెంట్‌తో పార్కింగ్‌లో వున్న కారు ఏసీని ఆన్ చేసేందుకు కొత్త డ్రైవింగ్ మోడ్‌ను కలిగివుంటుంది. ఇంకా గూగుల్ డూప్లెక్స్ వెబ్, కూల్ ఎంచాట్‌మెంట్స్ కూడా వస్తున్నాయి. కారులోని ఏసీ రిమోట్ మోడ్లో టర్న్ అవుతుంది. 
 
ప్రస్తుతం గూగుల్ అసిస్టెంట్ క్లౌడ్‌ ద్వారా పనిచేస్తోంది. 100 జీబీ నెట్ సామర్థ్యంతో వాయిస్, భాషను అర్థం చేసుకునేలా ఇది పనిచేస్తుంది. ఇప్పటికే ఇంజినీర్లు హాఫ్ గిగాబైట్‌తో దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ గూగుల్ అసిస్టెంట్ స్మార్ట్ ఫోన్లలోకి ఎంట్రీ ఇవ్వనుంది. 
 
ఇక గూగుల్ అసిస్టెంట్ కీలక ఉపయోగం ఏమిటంటే.. ప్రైవసీని ఇంప్రూవ్ చేయడమే. కానీ నెట్‌వర్క్ లేని పక్షంలో ఇది పనిచేయడం కష్టతరమవుతుంది. అయితే కొత్త గూగుల్ అసిస్టెంట్ కొత్త ఫీచర్స్ ద్వారా పదింతలు రెట్టింపు వేగంతో ప్రస్తుతం పనిచేస్తుంది. ఇంకా మనం ఇచ్చే కమాండ్స్, భాషను అతివేగంగా అర్థం చేసుకుంటుంది. 
 
గూగుల్ అసిస్టెంట్‌ను ఓపెన్ చేసి గ్యాలరీ నుంచి స్నేహితులకు ఫోటోలను పంపడం చేయవచ్చు. ఈ ప్రక్రియను వాయిస్ ద్వారా కమాండ్ చేయవచ్చు. హే గూగుల్.. సెండ్ ఇట్ అంటే చాలు.. అసిస్టెంట్ ఆ ఫోటోను మీ స్నేహితులకు పంపేస్తుంది. అంతేగాకుండా నెక్ట్స్-జనరేషన్ గూగుల్ అసిస్టెంట్ త్వరలో పిక్సెల్ ఫోన్లకు కూడా ఈ ఏడాది అందుబాటులో వుంటాయి. 
 
డ్రైవింగ్ మోడ్‌లో అసిస్టెంట్ ద్వారా బ్లూటూత్‌ను కనెక్ట్ చేయవచ్చు. మీ వాయిస్ డ్వారా డ్రైవింగ్ కూడా చేయవచ్చు. కాంటాక్ట్స్, మ్యూజిక్స్ వంటి వాటిని వాయిస్ కమాండ్స్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతానికి గూగుల్ అసిస్టెంట్ మ్యాప్స్ ద్వారా అందుబాటులో వున్నాయి. ఇక ఈ గూగుల్ మ్యాప్స్‌కు కూడా అసిస్టెంట్ స్మార్ట్‌గా పనిచేసేందుకు రెడీ అవుతోంది. 
 
కారు ఏసీ, ఇంధనం స్థాయి, డోర్ లాక్ వంటివి ఈ మ్యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ అసిస్టెంట్ హుండాయ్ బ్లూ లింక్, బెంజ్ కార్లకు సపోర్ట్ అవుతుంది. అలాగే గూగుల్ అసిస్టెంట్ వెబ్ పేజీల్లో ట్రిప్ డీటైల్స్‌ను జీ-మెయిల్ ఆధారంగా ఫిల్ చేస్తుంది. అమెరికా, యూకేల్లో మూవీ టిక్కెట్లు కూడా ఆటోమేటిక్‌గా వాయిస్ కమాండ్‌తో బుక్ చేసుకునే సౌకర్యం వుంది. 
 
గూగుల్ సెర్చ్ శామ్‌సంగ్, వోల్వోలలో సపోర్ట్ చేస్తుంది. గూగుల్ లెన్స్ కూడా త్వరలో అప్‌గ్రేడ్ కానుంది. ఉదాహరణకు రెస్టారెంట్‌కు వెళితే.. మెను కార్డులో ఏయే వంటకాలు పాపులరో అదే చెప్పేస్తుంది. మెను నుంచి ఫుడ్ ఫోటోలను లాక్ చేస్తుంది. గూగుల్ లెన్స్ ఆ ఫోటోలపై రివ్యూను కూడా ఇచ్చేస్తుంది. ఈ ఫీచర్‌కు మంచి క్రేజ్ వుండటంతో అతి తక్కువ డేటా సౌకర్యంతో యూజర్లకు అందించేందుకు గూగుల్ చర్యలు చేపట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23 తర్వాత కొత్త ప్రధాని.. ఆయనెవరో నేనే వెల్లడిస్తా : చంద్రబాబు