తలనొప్పి ఇటీవల కాలంలో చాలా మందిని వేధించే సమస్య, ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అవి తక్షణం బాధ నుండి కొంత ఊరటనిచ్చినా, దుష్ప్రభావాలు కలిగించే ప్రమాదం ఉంది.
కొంత మందికి తలనొప్పి తాత్కాలికంగా ఉంటుంది. మరికొంత మందికి పదే పదే వచ్చి ఇబ్బంది పెడుతుంటుంది. మందులు వాడినా పెద్దగా ప్రయోజనం కనిపించకపోవచ్చు. కొన్ని సాధారణ చిట్కాలు పాటించినట్లయితే తలనొప్పి బాధ నుండి తప్పించుకోవచ్చు.
దాల్చిన చెక్క ఆహారానికి రుచిని ఇవ్వడమే కాక, తలనొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి నుదుటిపై రాసుకుని ముప్పై నిమిషాల తరువాత వేడి నీటితో కడిగితే తలనొప్పి తగ్గుతుంది. తాజా ద్రాక్ష పండ్లను జ్యూస్ చేసుకుని తాగడం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్‌ను రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.