Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతుంటే.. ఎండు ద్రాక్షలను?

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షల్లోని పీచు కడుపులోని నీటిని పీల్చేస్తుంది. తద్వారా విరేచనాలు వంటి ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (11:44 IST)
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షల్లోని పీచు కడుపులోని నీటిని పీల్చేస్తుంది. తద్వారా విరేచనాలు వంటి ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండటం ద్వారా బక్కపలచగా ఉన్నవారు తీసుకోవచ్చు. తద్వారా బరువు పెరుగుతారని న్యూట్రీషన్లు చెప్తున్నారు. ఎండుద్రాక్షల్లోని ధాతువులు, కొలెస్టరాల్, విటమిన్లు, పీచు వంటివి శరీరానికి పోషకాలను అందిస్తాయి.
 
వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని యాంటీయాక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను దూరం చేస్తాయి. హైబీపీని నివారిస్తాయి. గుండెను పదిలంగా ఉంచుతాయి. ఎండుద్రాక్షల్లో పొటాషియం రక్తనాళ్లాల్లో ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 
పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతుంటే వారికి వారంపాటు ప్రతిరోజూ రాత్రి రెండు ఎండు ద్రాక్ష పొలుకులను ఇవ్వండి. ఈ వారంలో వారికి చలవచేసే వస్తువులు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీంతో పక్క తడిపే అలవాటునుంచి ఉపశమనం కలుగుతుంది.
 
ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments