Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరువెచ్చని నీరు లేదా ఎక్కువ నీరు తాగితే COVID-19 చచ్చిపోతుందా?

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (22:43 IST)
గోరువెచ్చని మంచినీళ్లు లేదంటే రోజుకి 12 గ్లాసుల మంచినీరు త్రాగటం వల్ల కరోనావైరస్ చచ్చిపోతుందన్న దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఐతే కడుపులో వున్న ఆమ్లం వైరస్‌ను చంపుతుంది. సాధారణంగా మంచి ఆరోగ్యం కోసం, రోజుకి 12 గ్లాసుల మంచినీరు తాగాలని సిఫార్సు చేయబడింది. మంచి ఆరోగ్యం కోసం మరియు డీహైడ్రేషన్ నివారించడానికి ప్రజలు ప్రతిరోజూ తగినంత నీరు కలిగి ఉండాలి.
 
సహజంగా వైరస్‌లు మన శరీరంలోని కణాలలోకి వెళ్లి వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి. కరోనా వైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు. మనం ఈ వైరస్‌ను శ్వాసలోకి పీల్చినపుడు (ఇది సోకిన వారు ఎవరైనా మనకు దగ్గరగా ఉండి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు), లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో తాకినపుడు, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు ఈ వైరస్ మన శరీరంలోకి చొరబడుతుంది.
 
మొదట మన గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి వైరస్ వ్యాపిస్తుంది. వాటిని 'కరోనా వైరస్ కర్మాగారాలు'గా మార్చేస్తుంది. అంటే.. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది. ఇది ప్రాథమిక దశ. ఈ దశలో మనం జబ్బుపడం. అసలు కొంతమందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.
 
కరోనా వైరస్ సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం- ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే.. ఈ కాలం సగటున ఐదు రోజులుగా ఉంది. కరోనా వైరస్ వల్ల ఆరంభంలో పొడి దగ్గు వస్తుంది. అంటే తెమడ వంటిదేమీ రాదు. వైరస్ సోకినపుడు కణాల్లో కలిగే అలజడి బహుశా దీనికి కారణం కావచ్చు.
 
కొన్ని రోజులు గడిచిన తర్వాత కొందరిలో దగ్గుతో పాటు తెమడ కూడా వస్తుంది. వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు ఈ తెమడ రూపంలో బయటకు వస్తాయి.  అక్కడి నుంచి మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది.
 
ఈ లక్షణాలకు శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ.. ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించటం, పారాసెటమాల్ మందులతో చికిత్స అందిస్తారు. ప్రత్యేకమైన ఆస్పత్రి చికిత్స అవసరం ఉండదు.
 
ఈ దశ ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ సమయానికి చాలా మంది కోలుకుంటారు. ఎందుకంటే.. వారిలోని రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే వైరస్‌తో పోరాడి దానిని తరిమేస్తుంది. అయితే, కొంతమందిలో కోవిడ్-19 వ్యాధి మరింతగా ముదురుతుంది. ఈ దశలో ముక్కు కారటం, జలుబుతో పాటు జ్వరం రావడం వంటి లక్షణాలు రావచ్చని అధ్యయనాల్లో తేలింది. 
 
ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి? 
ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలను కానీ, ప్రభుత్వం ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్లను కానీ సంప్రదించాలి. కరోనా వైరస్ సోకిన వారిలో చాలామంది విశ్రాంతి తీసుకుని, పారాసెటమాల్ వంటి మాత్రలు తీసుకుని కోలుకుంటున్నారు. అయితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంటేనే ఆసుపత్రిలో వైద్యం అవసరమవుతుంది.
 
ఊపిరితిత్తులు ఎంతగా దెబ్బతిన్నాయో డాక్టర్లు పరీక్షించి తదనుగుణంగా ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్టుతో వైద్యం అందిస్తారు. అయితే, తీవ్రంగా జబ్బుపడి, మీ రోజువారీ కార్యక్రమాలను కూడా చేసుకోలేక పోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతుంటే, కొన్ని పదాలకు మించి మాట్లాడలేక పోతుంటే, వాసన, రుచిలను గుర్తించలేని స్థితిలో ఉంటే వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలను కానీ, ప్రభుత్వం ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్ 104 లేదా మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments