రక్తపోటును బీట్‌రూట్ రసం తగ్గిస్తుందా?

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (20:34 IST)
అధిక రక్తపోటు... అదే హైపర్ టెన్షన్. ఇటీవలి కాలంలో ఇది చాలామందిని వేధిస్తున్న సమస్య. దీనికి మాత్రలు వేసుకుంటూ వుంటారు చాలామంది. ఆ సంగతి అలావుంచితే హైపర్ టెన్షన్‌ను సహజసిద్ధంగా తగ్గించేందుకు బీట్ రూట్ రసం ఉపయోగపడుతుందని అంటున్నారు పరిశోధకులు. అధిక రక్తపోటు ఉన్నవారిలో కొందరికి మాత్రలకు బదులుగా 200 మి.లీ బీట్‌రూట్‌ రసాన్ని ఇచ్చి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచారు. ఆ రసం తీసుకున్న కేవలం మూడు నుంచి ఆరు గంటల్లోనే 10 ఎంఎంహెచ్‌జి రక్తపోటు తగ్గింది. 
 
పైగా ఆ రసం ప్రభావంతో అధిక రక్తపోటు 24 గంటల దాకా నియంత్రణలోనే ఉన్నట్టు వెల్లడైంది. అందువల్ల అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు నైట్రేట్‌ సమృద్ధిగా ఉన్న కూరగాయలు ఆకుకూరలు తరుచుగా తీసుకోవడం ద్వారా తమ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. 
 
అంతేకాకుండా, నైట్రేట్‌ సమృద్ధిగా ఉండే కూరగాయల్లోని నైట్రేట్‌లో అధిక రక్తపోటును తగ్గించేందుకు తోడ్పడే అంశాలున్నాయని స్పష్టమయ్యింది. మన శరీరంలో ఆహారంలోని నైట్రేట్‌ను నైట్రిట్‌ అనే రసాయనంగా ఆ తర్వాత నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మార్చే గుణం ఉంది. దీనికి రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్తపోటును తగ్గించే గుణం ఉందని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

Girl friend: ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం.. భార్యే ఆస్పత్రిలో చేర్చింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

తర్వాతి కథనం
Show comments