స్త్రీలను ఇబ్బంది పెట్టే గడ్డాలు-మీసాలు, పోగొట్టడం ఎలా?

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (19:51 IST)
పురుషులకు గడ్డాలు-మీసాలు వస్తే పట్టించుకోరు అదే స్త్రీలకు కనుక కనిపిస్తే వారి బాధ వర్ణనాతీతం. చాలామంది స్త్రీలలో ఈ అవాంఛిత రోమాల సమస్య పట్టుకుంటుంది. ఈ రోమాలను తొలగించడానికి ఎన్నో సౌందర్య సాధనాలు ఉన్నప్పటికీ వీటివల్ల ఫలితం తాత్కాలికమే. 
 
అందువల్ల అన్‌వాంటెడ్ హెయిర్ రిమూవల్ కు అత్యాధునిక సౌందర్య చికిత్సలు ఉన్నప్పటికీ వీటి ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుందనేది అనుమానమే. కాబట్టి ఈ చికిత్సల కంటే ఇంట్లోనే మనకు లభించే వస్తువులతో హెయిర్ రిమూవర్‌ను తయారుచేసుకుని అప్లై చేస్తే ఫలితం ఉంటుంది.
 
శనగపిండి పేస్టు:
అరకప్పు శనగపిండిలో అరకప్పు పాలు, ఒక టీ స్పూన్ పసుపు, తాజా మీగడ(పొడి చర్మతత్వం కలిగి ఉంటేనే) కలుపుకుని ఈ పేస్టును ముఖంపై వెంట్రుకలు పెరిగే దిశలో అప్లై చేయాలి. అరగంట ఆగిన తర్వాత ఆ పేస్టు పూర్తిగా ఆరిన తర్వాత మాస్కును వేళ్లతో హెయిర్ గ్రోత్ కు వ్యతిరేక దిశలో రుద్దాలి. పేస్ట్ మరీ పొడిగా అనిపిస్తే వేళ్లను కొద్దిగా తడి చేసుకోవచ్చు. ఇలా చేశాక పేస్ట్ అంతా ముఖంపై నుంచి పోయాక తడి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. 
 
చక్కెర - నిమ్మరసం... 
రెండు స్పూన్ల చక్కెర, రెండు స్పూన్ల తాజా నిమ్మరసం, నీళ్లు తీసుకుని చక్కెర కరిగే వరకూ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. 15 - 20 నిమిషాలు ఆగాక వేళ్లతో సున్నితంగా రుద్దుతూ కడిగేయాలి. ఇలా వారానికి రెండుమూడుసార్లు చేస్తుంటే అవాంఛిత రోమాలు తగ్గుముఖం పడుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ మైనింగ్‌ను బాట వేస్తోన్న ఉచిత ఇసుక విధానం.. పచ్చి మోసం.. గోవర్ధన్ రెడ్డి

రైల్వేకోడూరు ఎమ్మెల్యే వల్ల 5 సార్లు ప్రెగ్నెంట్, అబార్షన్ అయ్యింది: మహిళ ఆరోపణ

సీఎం హోదాను పక్కనబెట్టి.. సాధారణ కార్యకర్తలా శిక్షణకు హాజరైన చంద్రబాబు

Telangana: ఫిబ్రవరి 11 నుంచి మున్సిపల్ ఎన్నికలు.. ఫలితాలు ఫిబ్రవరి 13న విడుదల

ఎపుడైనా.. ఎక్కడైనా.. ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా.. కానీ కొన్నాళ్ళకే అసలు విషయం తెలిసింది.. : తమన్నా

15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసిన మన శంకరవరప్రసాద్ గారు

ఆ బాలీవుడ్ హీరోయిన్ నా లక్కీ ఛార్మ్ : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ

బరాబర్ ప్రేమిస్తా లో మళ్లీ మళ్లీ సాంగ్ బాగుంది : జయంత్ సి పరాన్జి

న్యాయం చేసేలా ప్రయత్నిస్తా : రఘు కుంచె - దేవగుడి అలరిస్తుంది : బెల్లం రామకృష్ణ రెడ్డి

తర్వాతి కథనం
Show comments