Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్రం డార్క్ కలర్‌లో వస్తే...

సాధారణంగా మూత్రం లేత పసుపు లేదా తెలుపు రంగులో వస్తుంది. మరికొందరికి మాత్రం డార్క్ కలర్‌లో వస్తుంది. ఈ రంగు ముదురు గోధుమ రంగు లేదా ముదురు పసుపు రంగులో ఉంటుంది. ఇలా డార్క్ రంగులో వస్తే మాత్రం ఖచ్చితంగా

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (10:00 IST)
సాధారణంగా మూత్రం లేత పసుపు లేదా తెలుపు రంగులో వస్తుంది. మరికొందరికి మాత్రం డార్క్ కలర్‌లో వస్తుంది. ఈ రంగు ముదురు గోధుమ రంగు లేదా ముదురు పసుపు రంగులో ఉంటుంది. ఇలా డార్క్ రంగులో వస్తే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి, మూత్ర పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. మనిషి అనారోగ్యం బారినపడితేనే ఇలా డార్క్ రంగులో మూత్రం వస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మూత్రం డార్క్ కలర్‌లో వస్తే ఈ సమస్యలు ఉన్నట్టు గుర్తించాలి.
 
* అనారోగ్యంతో బాధపడేవారు వివిధ రకాల మందులను వాడుతుంటారు. అలాంటివారి మూత్రం రంగు మారిపోతుంది. ముఖ్యంగా యాంటీ బయోటిక్స్, లాక్సేటివ్స్, విటమిన్ బి సప్లిమెంట్లు వేసుకుంటుంటే మూత్రం రంగు మారుతుంది.
 
* మూత్రం ముదురు గోధుమ రంగు (డార్క్ బ్రౌన్ కలర్)లో వస్తుంటే అందుకు లివర్ వ్యాధులు కారణమవుతాయి. బైలిరుబిన్ అనే ద్రవం ఎర్ర రక్తకణాలతో కలిస్తేనే మూత్రం ఇలా వస్తుంది. మూత్రం ఈ రంగులో వస్తుంటే అలాంటి వారికి లివర్ వ్యాధులు ఉన్నట్లు గ్రహించాలి. ఇలాంటి వారు లివర్ ఫంక్షన్ సరిగా ఉందో లేదో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. 
 
* బ్లాక్‌బెర్రీలు, బీట్‌రూట్స్ తదితర ఆహారాలను తింటే మూత్రం పింక్ రంగులో వస్తుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తిన్నా మూత్రం రంగు మారుతుంది. దీన్ని కొందరు భ్రమపడి మూత్రంలో రక్తం వస్తుందని అనుకుంటారు. అయితే నిజానికి కొందరికి ఈ ఆహారాలను తినకున్నా మూత్రంలో రక్తం వస్తుంటుంది. అందుకు కారణాలు వేరే ఉంటాయి. అలాంటి వారు డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. 
 
* మూత్రం డార్క్ కలర్‌లో రావడానికి గల కారణాల్లో ముఖ్యమైంది డీహైడ్రేషన్. శరరీంలో ద్రవాలు తగినంతగా లేకపోతే మూత్రం రంగు మారుతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు నీటిని బాగా తాగినట్టయితే డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. అప్పుడు మూత్రం కూడా ధారాళంగా వస్తుంది. కలర్ మారుతుంది.
 
* బైలిరుబిన్, కొలెస్ట్రాల్ రెండూ కలసి గాల్ స్టోన్స్‌గా మారుతాయి. అయితే ఇవి అంత సమస్య కాకపోయినా కొన్ని సార్లు మాత్రం గాల్ బ్లాడర్ డక్ట్‌ను బ్లాక్ చేస్తాయి. దీంతో ఆ ప్రదేశం వాపునకు లోనవుతుంది. ఈ క్రమంలో తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. అలాగే మూత్రం కూడా డార్క్ కలర్‌లో వస్తుంది. ఇలాంటి వారు నిత్యం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్‌కు‌గాను సర్జరీ చేయించుకోవాలి.
 
* పచ్చ కామెర్లు ఉన్నవారిలోనూ మూత్రం రంగు మారుతుంది. మూత్రం డార్క్ కలర్‌లో వస్తుంది. లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పచ్చకామెర్ల వ్యాధి వస్తుంది. దీని వల్ల కళ్లు, చర్మం పసుపు రంగులో కనిపిస్తుంటాయి. దీనికి తగిన వైద్యం చేయించుకుంటే పచ్చకామెర్ల వ్యాధి నుంచి బయటపడొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

తర్వాతి కథనం
Show comments