Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోవు - కొబ్బరికాయది హిందూమతమా? ఖర్జూరం - గొర్రె ముస్లిం మతంలో చేరాయా?

సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవు, కొబ్బరికాయ ఎపుడు హిందూ మతం పుచ్చుకున్నాయనీ, ఖర్జూరం, గొర్రె ఎపుడు ముస్లిం మతం స్వీకరించాయని ఆయన ప్రశ్నించారు.

గోవు - కొబ్బరికాయది హిందూమతమా? ఖర్జూరం - గొర్రె ముస్లిం మతంలో చేరాయా?
, శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (12:27 IST)
సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవు, కొబ్బరికాయ ఎపుడు హిందూ మతం పుచ్చుకున్నాయనీ, ఖర్జూరం, గొర్రె ఎపుడు ముస్లిం మతం స్వీకరించాయని ఆయన ప్రశ్నించారు. అలాగే, పసుపు, కాషాయ వర్ణాలది ఏ జాతి అంటూ బీజేపీ నేతలను ఆయన నిలదీశారు. 
 
కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ కమలనాథులపై మరోమారు విరుచుకుపడ్డారు. తాను వెళ్లిన ప్రతి చోట కొందరు మతఛాందసవాదులు ఆవు పేడతో కళ్లాపి చల్లి, గోమూత్రంతో శుద్ధి చేస్తున్నారన్నారు. ఇదెక్కడి వింత ఆచారమన్నారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కానని, అణగారిన వర్గాలకు ఎప్పడూ అండగా ఉంటానని తేల్చి చెప్పారు. బీజేపీపై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. 
 
మనిషి కన్నా గోవే ముఖ్యమని కొందరు మతఛాందసవాసులు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కొందరు ఆ తర్వాత రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారని, దళితులను శునకాలతో పోలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార పద్ధతుల గురించి ప్రశ్నించే నాయకులకు మనుషులు కనిపించడం లేదా? అని కేంద్రమంత్రి, బీజేపీ నేత అనంతకుమార్ హెగ్డేను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హల్లో కేసీఆర్... నేను పబ్లిక్‌లో నగ్నంగా నిలబడతా...